
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 75,188 మంది భక్తులు దర్శించుకున్నారు. పండుగల వేళ భక్తుల సంఖ్య పెరగడంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంట సమయం పడుతోంది.
ఇక, తిరుమలలో నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,640 మందిగా ఉంది. గురువారం స్వామివారి హుండీ ఆదాయం 2.66 కోట్లుగా టీటీడీ తెలిపింది. మరోవైపు.. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంట సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 6 గంటలు.. ఇక, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.