ఎన్నికల మేనిఫెస్టో హామీలను ఆయన విస్మరించారు
బాబు పాలన యువత, రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెడుతోంది
8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదు
రూ.4,900 కోట్ల విద్యా దీవెన, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయి
యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి రెండేళ్లుగా లేదు
స్వామి వివేకానంద విశ్వాసానికి భిన్నంగా.. దుర్భర పరిస్థితుల్లో రాష్ట్ర యువత
మోసాల ద్వారా ఈ సర్కారు యువత లక్ష్యాలకు అడ్డుపడుతోంది
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజం
కదలండి.. మేల్కోండి.. ఇకనైనా యువత లక్ష్య సాధనకు తోడ్పడండి అని డిమాండ్
సాక్షి, అమరావతి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని, కానీ... రాష్ట్రంలో యువత అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీలను విస్మరించి యువతకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఆయన పాలన యువత, రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకొనే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన బోధనలను గుర్తుచేస్తూ... చంద్రబాబు యువతకు చేసిన మోసాలను ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పాలనలో 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.4,900 కోట్ల విద్యా దీవెన, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయని ధ్వజమెత్తారు.
టీడీపీ కూటమి మేనిఫెస్టో వాగ్దానమైన యవతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి రెండేళ్లుగా చెల్లింపు లేదని గుర్తు చేశారు. ఆన్‌లైన్ సర్టీఫికేషన్ కోర్సులు నిలిపేశారని పేర్కొన్నారు. ఇలా మోసాలకు పాల్పడడం ద్వారా చంద్రబాబు సర్కారు యువత వారి లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. వివేకానంద ప్రముఖ సూక్తిని ప్రస్తావిస్తూ ‘‘ఇకనైనా కదలండి.. మేల్కోండి.. యువత వారి లక్ష్యాల సాధనకు తోడ్పడండి’’ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

Swami Vivekananda believed that if the youth work with focus and a goal, India grows stronger. On this National Youth Day, we remember his call.
Is the state government allowing the youth to achieve this goal?
In reality, the state of Andhra Pradesh's youth is grim:
• 8…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2026


