వైఎస‍్సార్‌సీపీలో నూతన నియామకాలు | New Appointments Ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస‍్సార్‌సీపీలో నూతన నియామకాలు

Mar 4 2026 8:18 PM | Updated on Mar 4 2026 8:27 PM

New Appointments Ysrcp

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డి(నంద్యాల),  ఎస్‌ఈసీ సభ్యునిగా వైసి గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి (పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ (పార్లమెంటు) పోరెడ్డి నరసింహారెడ్డి (ప్రొద్దుటూరు) నియమితులయ్యారు.

కాగా, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్ల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్‌నాథ్‌ నియమితులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement