ఆదాయాన్ని మళ్లించి అరుపులు! | Chandrababu new drama in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆదాయాన్ని మళ్లించి అరుపులు!

Jan 13 2026 4:28 AM | Updated on Jan 13 2026 4:28 AM

Chandrababu new drama in Andhra pradesh

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో డ్రామా

ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చిర్రుబుర్రు 

పనితీరు మెరుగుపర్చుకోకపోతే దోషులుగా నిలబెడతానంటూ అధికారులకు బెదిరింపులు 

పొలిటికల్‌ గవర్నెన్స్‌ పేరుతో పాలనను అస్తవ్యస్తం చేసిన చంద్రబాబు 

పేరుకే ఉచిత ఇసుక.. గతంతో పోల్చితే డబుల్‌ రేటు.. అదంతా పచ్చ ముఠాల జేబుల్లోకే.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏటా ఇసుక ద్వారా ఖజానాకు రూ.750 కోట్ల ఆదాయం 

ఇసుక నుంచి క్వార్జ్, సిలికా, లేటరైట్‌ లాంటి సహజ వనరులను కొల్లగొడుతున్న టీడీపీ ముఠాలు 

మద్యం షాపులు.. బెల్ట్‌ షాపులు టీడీపీ నేతల గుప్పిట్లోనే 

ప్రతి ఐదు బాటిళ్లలో ఒకటి నకిలీ సరుకే.. 

ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తూ దోపిడీ.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం టీడీపీ నేతల చేతుల్లోకి 

సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల అమల్లో చంద్రబాబు ఘోర వైఫల్యం.. 

దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆదాయం తగ్గిందంటూ నాటకాలు అడుతున్నారంటున్న రాజకీయ విశ్లేషకులు

సాక్షి, అమరావతి: ఇసుక నుంచి మద్యం వరకూ అన్నింటా దోపిడీ.. కేవలం 19 నెలల్లోనే దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో రూ.3.02 లక్షల కోట్ల అప్పులు.. అయినా సరే సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. ఇన్నాళ్లూ ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు ఎట్టకేలకు సోమవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో వా­స్తవాలను అంగీకరించారు. ఆ నెపాన్ని అధికా­రుల­పైకి నెట్టారు. ఆదాయ ఆర్జన శాఖ­లు పనితీరు కనపర్చాలని.. సాకులు చెబితే కుదరదని.. అలాంటి అధికారులు, కలెక్టర్లను ప్రజల ముందు దోషులుగా నిలబెడతానంటూ హూంకరించారు.

చంద్రబాబు సీఎం కాగానే ఇకపై పొలిటికల్‌ గవర్నెన్స్‌ అంటూ ప్రకటన చేయడం తెలిసిందే. ఇదే అదునుగా పచ్చ ముఠాలు ఇసుక నుంచి క్వార్ట్జ్, సిలికా, మైనింగ్, లేటరైట్‌ వరకూ సహజ సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నాయి. మద్యం షాపులు, బెల్ట్‌షాపులను గుప్పిట్లో పెట్టుకుని నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నాయి. ఒకపక్క రాష్ట్ర ఆదాయానికి గండి కొడు­తూ.. మరోవైపు టీడీపీ నేతల దోపిడీని ప్రోత్సహిస్తూ.. చివరకు రాబడి తగ్గి­తే అధికార యంత్రాంగాన్ని బాధ్యులుగా చేస్తామని చంద్రబాబు బెదిరింపులకు దిగడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తుండటంతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రభుత్వ వై­ఫ­ల్యాలు, అవినీతిని నిలదీసే ప్రతిపక్ష నేత­లు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రశి్నంచే గొంతులను నులిమేందుకు బాబు సర్కారు చేయని కుట్రలు లేవు.   

ఖజానాకు గండి.. పచ్చ ముఠాలకు రాబడి 
కూటమి సర్కారు అవినీతి విశృంఖలంగా సాగుతుండటంతో ప్ర­భు­త్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి చేరుతోంది. దీనివల్లే ప్రభు­త్వ ఆదాయం తగ్గుతోందన్నది బహిరంగ రహస్యం. పొలిటికల్‌ గవర్నెన్స్‌తో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని.. విచ్చలవిడి అవినీతి వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులుగా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఐఏఎస్‌లు స్పష్టం చేస్తున్నా­రు. వైఎస్సార్‌ సీపీ హయాంలో ఇసుక ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది.

ఇప్పుడు పేరుకే ఉచిత ఇసుక.. ఇసుక ర్యాంప్‌లను తమ అ«దీనంలోకి తీసుకుని టీడీపీ ముఠాలు యథేచ్ఛగా తవ్వేస్తూ, అధిక ధరకు విక్రయించి దోచే­స్తున్నాయి. ఫలితంగా గతంతో పోల్చితే ఇప్పుడు ఇసు­క ధర డబుల్‌ అయ్యింది. కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం సున్నా. ఆ ఆదాయమంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ఇక టీడీపీ సర్కార్‌ అధికారంలోకి రాగానే మద్యం షాపులను తమ అధీనంలోకి తీసుకుని.. ఊరూ వాడా బెల్ట్‌ షాపు­లు తెరిచారు. నకిలీ మద్యం త­యా­రీని కుటీర పరిశ్రమగా మార్చేశారు. మద్యం షాపులు, బెల్ట్‌ షాపుల్లో అమ్మే ప్రతి ఐదు బాటిళ్లలో ఒకటి నకిలీ మ­ద్యం బాటిలే! ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తూ, అడ్డగోలుగా దో­చే­స్తూ ప్ర­భుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. దీంతో అవి­నీతి వ్య­వస్థీకృతమైపోయినా, ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

మోసాలుగా సూపర్‌ సిక్స్‌ హామీలు.. 
రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. గతేడాది, ఈ ఏడాదీ ఎగ్గొట్టారు. ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేల చొప్పున ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకూ ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామన్న హామీకి ఎగనామం పెట్టారు. ఇక 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 చొప్పున పెన్షన్‌ ఇస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని గతేడాది, ఈ ఏడాదీ అమలు చేయకుండా మోసం చేశారు. తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

యూడీఐఎస్‌ఈ (యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌యూడైస్‌) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించినా ఇప్పటివరకూ ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే.. అదీ ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించి.. 21 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టారు.

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకంతో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చి.. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టి మోసం చేశారు. సూపర్‌ సిక్స్, సెవెన్‌సహా అన్ని హామీలదీ అదే తీరు. ఓవైపు సహజ వనరులను దోచేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. మరోవైపు రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించినా హామీలను చంద్రబాబు సర్కార్‌  అమలు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

అప్పుల్లో రికార్డు.. హామీలకు వెన్నుపోటు 
వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్లు అప్పులు మాత్రమే చేసింది. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసింది. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో ప్రజల ఖాతాల్లో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా జమ చేసి రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేయగా, అందులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల కింద పేదల ఖాతాల్లో జమ చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ నాడు చంద్రబాబు దుష్ఫ్రచారం చేశారు.

దానికి ఎల్లో మీడియా తందాన పాడింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్‌ 19 నెలల్లోనే ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు అప్పులు చేసింది. అంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో.. చంద్రబాబు సర్కార్‌ కేవలం 19 నెలల్లోనే 90.87 శాతం అప్పులు చేసింది. అయినా సరే సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నీళ్లొదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement