ఏపీ ప్రభుత్వం కొత్త ఆదాయం టార్గెట్‌ రూ. 13 వేల కోట్లు | AP Government Sets ₹13,000 Crore Revenue Target Through GST, Lottery, Online Gaming, And Local Taxes | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వం కొత్త ఆదాయం టార్గెట్‌ రూ. 13 వేల కోట్లు

Jan 12 2026 9:51 PM | Updated on Jan 13 2026 12:22 PM

AP government has set a new revenue target of  RS13000 crore

విజయవాడ:    రూ. 13 వేల కోట్లు కొత్త ఆదాయం సాధించాలనే టార్గెట్‌ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. వివిధ మార్గాల్లో ప్రజల నుండి ఈ ఆదాయాన్ని వసూలు చేసేందుక కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు రూ. 13 ఏల కోట్లు కొత్త ఆదాయం టార్గెట్‌ను పెట్టకున్నట్లు హెచ్‌ఓడీ సదస్సులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ వెల్లడించారు. 

SGSTపై 1% సెస్ ద్వారా రూ. 4,700 కోట్లు అదనపు ఆదాయం సాధించాలనే ప్రతిపాదించారు. 55వ GST కౌన్సిల్ సమావేశంలో  సెస్ పరిశీలనలో ఉంది. ఇక  ఏపీ లాటరీ ద్వారా రూ. 3 వేల కోట్లు సాధించే ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. 

ఆన్‌లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ. 1,400 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల వినోద పన్ను రూపంలో ₹2,300 కోట్లు,  రెండో, మూడో స్థాయి అమ్మకాలపై VAT ద్వారా ₹1,300 కోట్లు, ప్రొఫెషన్ టాక్స్ పెంపు ద్వారా ₹400 కోట్లు,  విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ప్రొఫెషన్ టాక్స్ వసూళ్ల బదిలీ ద్వారా ₹110 కోట్లు ఇలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పీయూష్ కుమార్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement