
కొన్నిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సినిమా రంగంపై ఊహించని పిడుగు వేశాడు. విదేశీ చిత్రాలపై 100 శాతం టారిఫ్స్ విధిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇది అమల్లోకి వస్తే ఓవర్సీస్‌లో టాలీవుడ్ చిత్రాలకు ఇబ్బంది ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు. దీని వల్ల ఇప్పట్లో తెలుగు మూవీస్‌కి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని తన అభిప్రాయాన్ని చెప్పారు. 'సాక్షి'తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)
ట్రంప్.. విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
ఇక్కడ లాస్ట్ అంటే బిఫోర్ ఎలక్షన్ నుంచి 'మాగా' అన్నది ఒక క్యాంపెయిన్. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వీలైనంత వరకు అంటే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు.. వాళ్ల ఉద్యోగ అవకాశాలన్నీ అమెరికాలోనే జరగాలన్నది ఆయన ఆశయం. దాని ప్రకారం సినిమాల్లో కూడా ఈ హాలీవుడ్ వర్క్ అంతా బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళకుండగా అమెరికాలో జరగాలన్నది ఆయన ఉద్దేశం. దాన్ని నియంత్రించడానికే 100% టారిఫ్ అన్నారు. కానీ అది ప్రాక్టికల్‌గా ఎలా అమలు చేయాలి అనేదానికి ఒక ప్రొసీజర్ లేదు. కాబట్టి అది అంత సులభం కాకపోవచ్చు.
ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ ఏమైనా సంతకం చేశారా?
అంటే నేను విన్నది ఏంటంటే.. ఇది ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలంటే దీన్ని అంటే ఆ గైడ్ లైన్స్ డెవలప్ కావాలి. దీన్ని స్టడీ చేయడానికి చాలా అంశాలున్నాయి. అంటే దేని మీద టాక్స్ వేయాలా దేని మీద టారిఫ్ వేయాలా అన్నది. ఇదంతా డెవలప్ చేయడం కూడా ఎంత టైం అన్నా పట్టొచ్చు. మూడు నెలలైనా కావొచ్చు ఏడాదైనా పట్టొచ్చు. అప్పటివరకు మనం ఏం చెప్పలేం. జనరల్‌గా టారిఫ్ ఉన్నా లేకున్నా మనం కాస్ట్ కంట్రోల్ చేసుకొని క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసే అంటే మన దరిదాపుల్లో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు.
(ఇదీ చదవండి: సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో హీరో కిరణ్ అబ్బవరం)