సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ దర్శించుకున్నారు. బుధవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం హీరోయిన్లు ఇద్దరూ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. జనవరి 14న తాను హీరోయిన్‌గా నటించిన అనగనగా ఒక రాజు విడుదలవుతోందని తెలిపింది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ ఏడాది మధ్యలో నాగచైతన్యతో నటించిన సినిమా విడుదలవుతుందని వెల్లడించింది. ఐశ్వర్య రాజేశ్.. సంక్రాంతికి విడుదలవుతున్న ప్రతి సినిమాకు ఆల్ ద బెస్ట్ తెలియజేసింది.
ఐశ్వర్య రాజేశ్ తెలుగమ్మాయే అయినా తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ కోలీవుడ్‌లో స్థిరపడింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఇక్కడివారికి దగ్గరైంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటించింది.
సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే..
జనవరి 9న ప్రభాస్ ‘ది రాజా సాబ్’, విజయ్ 'జననాయకుడు' విడుదలవుతున్నాయి. జనవరి 10న శివకార్తికేయన్ 'పరాశక్తి', జనవరి 12న చిరంజీవి 'మన శంకర్ వరప్రసాద్ గారు', జనవరి 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', జనవరి 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగ ఓరాజు', శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి' రిలీజవుతున్నాయి.


