వాషింగ్టన్ డీసీ: సహజ సంపదలతో అలరారే వెనెజువెలా ..ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కర్రపెత్తనంతో చిగురాకుటాలా వణికిపోతోంది. ఆ దేశ చమరును, దాని ద్వారా వచ్చే ఆదాయాలపై తానే పెత్తనం చెలాయిస్తానంటూ అధికారిక ప్రకటన చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనెజువెలాతో కీలక చమురు ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం, వెనెజువెలా 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్‌ను అమెరికాకు ఇవ్వనుంది. వాటి ధర, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని అమెరికానే పర్యవేక్షిస్తుందని సోషల్ ట్రూత్ వేదికగా స్పష్టం చేశారు.
ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్‌రైట్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళిక తక్షణమే అమలు చేయండి. వెనెజువెలా చమురును షిప్పుల్లో నింపండి. వాటిని అమెరికా డాక్‌లలో స్టోర్ చేయండి’అని స్పష్టం చేశారు.
ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే వెనెజులాలో వెలికి తీసిన చమురును బ్యారెల్స్‌లో నింపారు. నౌకల ద్వారా అమెరికా గల్ఫ్ కోస్ట్ ప్రాంతంలోని రీఫైనరీలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.


