
తెలుగు హీరో కిరణ్ అబ్బవరం.. తన భార్య, కొడుకుతో కలిసి పెళ్లిలో సందడి చేశాడు. తన సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న డేనియల్ విశ్వాస్.. మాధురి అనే అమ్మాయిని శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. మదనపల్లిలోని ఓ చర్చిలో ఈ శుభకార్యం జరిగింది. దీనికి కిరణ్ అబ్బవరం ఫ్రెండ్స్ అందరూ హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)
'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం.. తర్వాత పలు సినిమాలు చేశాడు. కానీ గతేడాది రిలీజైన 'క' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం 'కె ర్యాంప్' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఇకపోతే తన చిత్రాలు 'వినరో భాగ్యము విష్ణుకథ', 'క' సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసిన డేనియల్ విశ్వాస్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో కిరణ్.. తన భార్య రహస్య, కొడుకు హనుతో కలిసి మరీ వేడుకకు హాజరయ్యాడు.
(ఇదీ చదవండి: 'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం)