
సినిమా పైరసీ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఈ మూఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద డెబిట్‌కార్డులు, హార్డ్‌డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. తాజాగా వాటిని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై వచ్చిన బెదిరింపుల వార్తలు అవాస్తం అంటూ తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ (Fact Check) టీమ్ చెప్పింది.
ఐ బొమ్మ గురించి తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ పేజీ తమ ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది. 'కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి. అవి కూడా పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే. దీనిని స్పష్టం చేస్తూ, తెలంగాణ పోలీసులకు ఇలాంటి ఎటువంటి బెదిరింపు రాలేదని తెలియజేస్తున్నాం. ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేసే, షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందిగా మనవి.' అని తెలిపింది.
#అలర్ట్: కొన్ని మీడియా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు.
అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి మరియు అవి పోలీసులకు కాకుండా… pic.twitter.com/gkcoqYtIqg— FactCheck_Telangana (@FactCheck_TG) October 3, 2025