
టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా ఈ జంటపై రూమర్స్ ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఎక్కడా కనిపించినా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు కథనాలొచ్చాయి. ఇంతకీ ఆ జంట ఎవరని అనుకుంటున్నారా? టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ లవ్ బర్డ్స్‌గా పేరున్న రష్మిక, విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మాత్రమే వచ్చాయి. వీటిపై ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.
అయితే ఈ సారి ఏకంగా వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయిందని కథనాలొచ్చాయి. ఇటీవల సైమా అవార్డుల వేడుకలకు హాజరైన రష్మిక చేతికి ఉంగరం కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో హీరోయిన్ రష్మిక తన చేతి వేలి ఉంగరంపై క్లారిటీ ఇచ్చింది. అది కేవలం నా సెంటిమెంట్ ఉంగరమని.. తాను నిశ్చితార్థం చేసుకుంటే అందరికీ చెప్తానని తెలిపింది. కాగా.. ఈ ఏడాది ఛావా, కుబేర సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.