
నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'అగ్లీ స్టోరీ'. రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, 'హే ప్రియతమా' లిరికల్ సాంగ్ రిలీజైంది. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు.
నందు పర్వర్ట్ క్యారెక్టర్ చేశాడు. అవికా గోర్ నందుని కాకుండా మరో అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ నందుకి ఇది ఇష్టముండదు. దీంతో అవికా గోర్‌ని ఇబ్బంది పెడతాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. శివాజీ రాజా, రవితేజ మహదాస్యం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో చిత్ర విడుదల గురించి వెల్లడించనున్నారు.