బిగ్‌బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్! | Bigg Boss 9 Telugu 11th Week Divya Eliminated | Sakshi
Sakshi News home page

Bigg Boss 9 Telugu: మరో కామనర్ ఔట్.. ఇది మాత్రం ఊహించిందే!

Nov 22 2025 5:50 PM | Updated on Nov 22 2025 6:48 PM

Bigg Boss 9 Telugu 11th Week Divya Eliminated

ప్రతివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. గతవారం గౌరవ్, నిఖిల్ బయటకొచ్చేశారు. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయినట్లు అయింది. మరి ఈ వారం ఎవరు ఔట్ అవుతారా అందరూ ఎదురుచూశారు. అందుకు తగ్గట్లే ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లోకి రాగా.. ఈమెనే ఎలిమినేట్ అవుతుందని చాలామంది ఊహించారు. ఇప్పుడు అలానే జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వారం నామినేషన్స్‌లోకి కళ్యాణ్‌, పవన్‌, ఇమ్మాన్యుయేల్‌, భరణి, సంజన, దివ్య వచ్చారు. ఇన్నివారాల పాటు మిస్ అవుతూ వచ్చిన ఇమ్ము.. తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఇదేమైనా ఇతడికి మైనస్ అవుతుందా అని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. అభిమానులు గట్టిగానే ఓట్లు వేశారట. తద్వారా ఓటింగ్‌లో తొలిస్థానం కల్యాణ్ దక్కించుకోగా.. రెండో స్థానంలో ఇమ్ము నిలిచాడట.

(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)

తర్వాత స్థానాల్లో పవన్, భరణి నిలిచారు. డేంజర్ జోన్‌లో సంజన, దివ్య ఉన్నారు. సంజనతో పోలిస్తే దివ్యపై గత కొన్నివారాల నుంచి నెగిటివిటీ పెరుగుతూనే వచ్చింది. దీనికి కారణం తనూజ. ప్రతిసారి తనూజతో దివ్య గొడవ పడుతూ వచ్చింది. శుక్రవారం ఎపిసోడ్‌లోనూ కెప్టెన్సీ విషయమై వీళ్లిద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇప్పటికే కెప్టెన్సీ, ఇమ్మ్యూనిటీ ఉన్న కారణంగా తనూజని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించేందుకు తాను ఓటు వేస్తున్నానని దివ్య చెప్పింది.

ఇలా పలు కారణాలతో పాటు నామినేషన్స్‌లో ఉన్న మిగతా వాళ్లతో పోలిస్తే దివ్యకు ఓటు బ్యాంక్ తక్కువగా ఉండటంతో 11వ వారం ఈమెనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈమె బయటకొచ్చేస్తే.. హౌస్‌లో ఉన్న కామనర్స్ కల్యాణ్, పవన్ మాత్రమే అవుతారు. చూడాలి మరి ఈసారి ఊహించినట్లే దివ్య ఎలిమినేట్ అవుతుందా లేదంటే మరెవరైనా బయటకొచ్చేస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement