
రిలయన్స్ జియో తన 9వ వార్షికోత్సవాన్ని ఇటీవలె జరుపుకొంది. అప్పటి నుండి, కంపెనీ తన వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. అందులో ఒకటే రూ.899 ప్లాన్. దీంతో హై స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు ఇతర ఆకట్టుకునే ప్రయోజనాలను అందిస్తోంది.
జియో రూ.899 ప్లాన్.. ప్రయోజనాలు
జియో నుండి వచ్చిన ఈ ఆకట్టుకునే ప్లాన్ ధర రూ.899. పూర్తి 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు 20జీబీ అదనపు డేటాను కూడా అందిస్తోంది. అంటే మొత్తం డేటా 200GB అవుతుంది.
ఇంకా ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ను కూడా అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపించుకోవచ్చు. జియో 5జీ నెట్ వర్క్ ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు.
డేటా, కాలింగ్ మాత్రమే కాదు, ఈ ప్లాన్ జియో టీవీ, జియో ఐ క్లౌడ్, జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లతో సహా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 3నెలల జియో హాట్ స్టార్ మొబైల్, టీవీ సబ్ స్క్రిప్షన్ కూడా చేర్చారు.
అదనంగా, ఈ ప్లాన్ లో 3 నెలల పాటు జియోసావ్ ప్రోకు 1 నెల జొమాటో గోల్డ్ సబ్ స్క్రిప్షన్, ఉచితంగా 6 నెలల నెట్ మెడ్స్ ఫస్ట్ సభ్యత్వం ఉన్నాయి. ఇంకా ఈజీ మై ట్రిప్ పై రూ .2220 వరకు డిస్కౌంట్, హోటల్ బుకింగ్ లపై 15% వరకు తగ్గింపును అందిస్తుంది. అజియోపై రూ.200 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్‌పై రూ.399 వరకు తగ్గింపును కూడా పొందుతారు.