
టాలీవుడ్ నటి సురేఖ కూతురు సుప్రీతా దాదాపు తెలుగువారికి సుపరిచితమే. ఆమె త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ -7 రన్నరప్ అమర్‌దీప్ చౌదరితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. అంతేకాకుండా పీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో చేస్తోంది. తాజాగా వీరిద్దరి జంటగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా సుప్రీత టాలీవుడ్లో తన సెలబ్రిటీ క్రష్ ఎవరనేది రివీల్ చేసింది. మీ లైఫ్లో క్రష్తో ఎప్పుడైనా డేట్ ఊహించుకున్నారా? అని సుప్రీతను ప్రశ్నించగా.. తన మనసులోని మాటలను చెప్పేసింది. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, అఖిల్తో డేట్ ఊహించుకున్నాని తెలిపింది. ఇప్పుడైతే హీరో నవీన్ పొలిశెట్టితో చాలా బ్యాడ్లీ క్రషింగ్ అంటూ రివీల్ చేసింది. అంతేకాకుండా స్కూల్ డేస్లో నా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేశానని సుప్రీత షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఈ కామెంట్స్ టాలీవుడ్లో తెగ వైరలవుతున్నాయి.