
పార్వతీ మెల్టన్.. ఒకప్పుడు టాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. పెళ్లై సుమారు 13ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు కొన్ని ఫోటోలను ఆమె పంచుకుంది. పలు సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె ఒక ఇండో అమెరికన్ సినీ నటి. అయితే, 2005లో వెన్నెల సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జల్సా, దూకుడు, గేమ్ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయింది. 2012లో శ్రీమన్నారాయణ చిత్రంతో తన నటనకు గుడ్‌బై చెప్పేసింది.
అమెరికాకు చెందిన వ్యాపారావేత్త 'షంసు లాలానీ'తో పార్వతీ మెల్టన్ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సినిమాలకు గుడ్‌బై చెప్పి 2012లో వివాహం చేసుకుంది. అయితే, సుమారు 13ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అందుకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలను షోషల్‌మీడియాలో పంచుకుంది.
పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ సినిమా 'జల్సా' చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ఆ తర్వాత ఆమె చేసిన చివరి చిత్రం శ్రీమన్నారాయణ.. దీంతో సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. తన సినీ కెరీర్ పాడవడానికి కారణం ఇద్దరు డైరెక్టర్స్ అని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ వారి పేర్లు మాత్రం చెప్పలేదు.