సింగర్‌గా మారిన వెన్నెల కిశోర్‌.. పాటతోనూ నవ్వించేశాడు! | Vennela Kishore Turn As A Singer, Singing Anukundhokati Song From Santhana Prapthirasthu | Sakshi
Sakshi News home page

సింగర్‌గా మారిన వెన్నెల కిశోర్‌.. పాటతోనూ నవ్వించేశాడు!

Oct 4 2025 7:04 PM | Updated on Oct 4 2025 8:00 PM

Vennela Kishore Turn As A Singer, Singing Anukundhokati Song From Santhana Prapthirasthu

స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారారు. ఇన్నాళ్లు తన హావభావాలతో అలరించిన ఈ కమెడియన్‌..ఇకపై తన గాత్రంతోనూ ఆకట్టుకోనున్నాడు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో  'అనుకుందొకటిలే..'అనే పాటను ఆయన ఆలపించాడు. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా 'అనుకుందొకటిలే..' పాటను ఆకట్టుకునేలా రూపొందించారు.

'అనుకుందొకటిలే..' పాట ఎలా ఉందో చూస్తే - అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే,అయిపోలేదులే, గేరే మార్చులే,  భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో.. అంటూ వినోదాత్మకంగా సాగుతుందీ పాట. ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేయగా, బాలవర్థన్ లిరిక్స్ అందించారు. వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నారు. సంజీవ్ రెడ్డి  దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement