ఓపక్క రష్మిక ఎంగేజ్‌మెంట్‌.. మాజీ ప్రియుడి పోస్ట్‌ వైరల్‌ | Ahead of Rashmika Mandanna Engagement, Rakshit Shetty Special Thanks to These 3 Members | Sakshi
Sakshi News home page

రష్మిక రెండో ఎంగేజ్‌మెంట్‌.. ఆ ముగ్గురికి హీరోయిన్‌ మాజీ ప్రియుడి స్పెషల్‌ థాంక్స్‌

Oct 4 2025 4:08 PM | Updated on Oct 4 2025 6:52 PM

Ahead of Rashmika Mandanna Engagement, Rakshit Shetty Special Thanks to These 3 Members

హీరోయిన్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రేమలో పడి చాలాకాలమే అయింది. విజయ్‌ దేవరకొండతో లవ్‌లో ఉన్న ఈ బ్యూటీ ఈ విషయాన్ని చాలాసార్లు పరోక్షంగా బయటపెట్టింది. దసరా సందర్భంగా వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అప్పుడే సగం పెళ్లి అయిపోయిందనిపించారు. కానీ, ఇది రష్మికకు రెండో ఎంగేజ్‌మెంట్‌ కావడం గమనార్హం!

ఫస్ట్‌ సినిమాకే లవ్‌
రష్మిక కన్నడ మూవీ 'కిరిక్‌ పార్టీ' (2016)తో సినీ ఇండస్ట్రీలో తొలి అడుగు వేసింది. రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటించాడు. ఫస్ట్‌ సినిమాకే హీరోతో ప్రేమలో పడింది రష్మిక. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎంగేజ్‌మెంట్‌ ఫిక్స్‌ చేశారు. 2017 జూలై 3న వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఊహించని షాకిచ్చారు. పెళ్లిపీటలు ఎక్కకముందే తమ బంధం ముక్కలైందని ప్రకటించారు. ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అలా అని వీరి మధ్య ఎటువంటి శత్రుత్వమూ లేదు. ఇప్పటికీ ఫోన్‌లో మెసేజ్‌ చేసుకుంటామని, సినిమాలు విడుదలైనప్పుడు ఒకరికొకరం విషెస్‌ తెలియజేసుకుంటామని రక్షిత్‌ శెట్టి 2023లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రష్మిక- రక్షిత్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫోటో

విజయ్‌తో లవ్‌..
రక్షిత్‌తో విడిపోయాక రష్మిక సినిమాలతో బిజీ అయింది. 2018లో గీత గోవిందం సినిమాలో తొలిసారి విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)తో జత కట్టింది. ఈ మూవీ సమయంలోనే విజయ్‌- రష్మిక ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది. అయితే తాము ఫ్రెండ్స్‌ మాత్రమేనని హీరోయిన్‌ క్లారిటీ ఇచ్చింది. కానీ తర్వాత ఆ రూమర్సే నిజమయ్యాయి. రష్మిక కలలు చాలా పెద్దవి అని రక్షిత్‌ చెప్పినట్లుగా... ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా హిందీలోనూ సినిమాలు చేస్తూ నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ అందుకుంది. పుష్పతో పాన్‌ ఇండియా సెన్సేషన్‌ అయింది.

ఉత్తమ నటుడిగా అవార్డు
అటు రక్షిత్‌ కూడా.. 777 చార్లీ (777 Charlie Movie), సప్తసాగరాలు దాటి సైడ్‌ A, సప్తసాగరాలు దాటి సైడ్‌ B సినిమాలతో ఘన విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో ఘనత అందుకున్నాడు. 2021లో సెన్సార్‌ అయిన సినిమాలకుగానూ కర్ణాటక ‍ప్రభుత్వం రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. అందులో 777 చార్లి సినిమాకు నాలుగు పురస్కారాలు వరించాయి. ఉత్తమ రెండో చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా రక్షిత్‌ శెట్టి, ఉత్తమ ఎడిటర్‌గా ప్రతీక్‌ శెట్టి, ఉత్తమ గేయరచయితగా నాగార్జున శర్మకు అవార్డులు ప్రకటించారు. 

హీరో ట్వీట్‌
దీంతో రక్షిత్‌ సంతోషంలో తేలియాడుతున్నాడు. '777 చార్లీ సినిమాకు 4 అవార్డులు.. మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. జ్యూరీకి, ప్రేక్షకులకు, చిత్రయూనిట్‌కు ధన్యవాదాలు. దర్శకుడు కిరణ్‌ రాజ్‌ విజన్‌.. ప్రతీక్‌ అద్భుతమైన ఎడిటింగ్‌, నాగార్జున చేతినుంచి జారిపడ్డ అందమైన మాటలు అందరి హృదయాలను తాకాయి' అంటూ ఈ ముగ్గురికి స్పెషల్‌ థాంక్స్‌ చెప్తూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

 

 

చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్‌మెంట్‌ లేదు, డిప్రెషన్‌.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement