
దసరా పండగ సందర్భంగా తన జీవితంలోని ఓ స్పెషల్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త ప్రయాణం అంటూ తన ఇంటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అలాగే పూజగది ఫోటోను కూడా షేర్ చేసింది. ఇంటి బయట గోడపై తన నిక్‌నేమ్ SAM అనే లోగో అందంగా అమర్చి ఉంది. అయితే ఈ ఇల్లు హైదరాబాద్‌లో ఉందా? ముంబైలోనిదా? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా కొత్తిల్లు కొన్న సామ్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమా
సమంత సినిమాల విషయానికి వస్తే.. ఏమాయ చేసావె మూవీతో తెలుగులో తన జర్నీ మొదలుపెట్టింది. బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మజిలి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల్లుడు శీను, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 1లో ఉ అంటావా మావా.. అనే ఐటం సాంగ్‌లో తళుక్కుమని మెరిసింది. ఇటీవల శుభం సినిమాలో అతిథి పాత్రలో నటించడంతో పాటు ఈ మూవీని తనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
చదవండి: ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్‌తోనే!