
ఓజీ డైరెక్టర్ సుజిత్ అప్పుడే మరో సినిమాకు సిద్ధమైపోయారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీ ఇటీవలే థియేటర్లో రిలీజైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఓజీ డైరెక్టర్ సుజిత్ మరో టాలీవుడ్ స్టార్‌తో జతకట్టారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టాలీవుడ్ హీరో నానితో మూవీకి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
SKY IS THE LIMIT…🔥#NaniXSujeeth @NameisNani @Sujeethsign pic.twitter.com/lIylWc2taZ
— Niharika Entertainment (@NiharikaEnt) October 2, 2025
With @NameIsNani anna 🤗❤️#NaniXSujeeth pic.twitter.com/gDBYKZtoD4
— Sujeeth (@Sujeethsign) October 2, 2025