అల్లర్ల భూమిగా మార్చేశారు.. విజయ్‌పై సినీ నటి కామెంట్స్‌ | Karur Tragedy Fallout: Actress Oviya Slams Vijay & TVK, Says He Misleads Youth with Violence | Sakshi
Sakshi News home page

అల్లర్ల భూమిగా మార్చేశారు.. విజయ్‌పై సినీ నటి కామెంట్స్‌

Sep 30 2025 1:55 PM | Updated on Sep 30 2025 2:29 PM

Actress Oviya Again Coments On Vijay and his fans

కరూర్ ఘటన తర్వాత సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై తీవ్రమైన వ్యతిరేఖత కనిపిస్తుంది. తమిళనాడులో తన ఉణికి కూడా ప్రమాదంలో పడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఇప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కనీసం  ఒక వీడియో రూపంలో కూడా స్పందించ లేదు. కేవలం సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ మాత్రమే షేర్‌ చేశారు.  దీంతో నెటిజన్లు నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది.

ఇప్పటికే విజయ్‌ని అరెస్ట్‌ చేయాలంటూ సినీ నటి ఓవియా సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ పంచుకుంది. అయితే, తాజాగా ఆమె మరోసారి ఇలా రియాక్ట్‌ అయింది. కరూర్ సంఘటన తర్వాత, రజనీకాంత్‌ సర్, అజిత్ సర్, సూర్య సర్ అభిమానుల మీద నాకు గౌరవం పెరిగింది. వారిలో చాలామంది సరైన మార్గంలో వెళ్తున్నారు. కానీ, విజయ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. టీవీకే ప్రచార ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చాలా ప్రమాదకరమైన ట్వీట్లు చేస్తూ.. హింసను సృష్టిస్తున్నాడు. అతను తమిళనాడును అల్లర్ల భూమిగా మారుస్తున్నాడు.' అంటూ ఆమె పేర్కొన్నారు

విజయ్‌ అభిమానులపై కూడా తమిళనాడులో విమర్శలు వస్తున్నాయి. విజయ్‌కు వ్యతిరేఖంగా ఎవరైనా మాట్లాడితే వారు బూతులతో ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. సోషల్‌మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్లు ఫేక్‌ ఫోటోలు క్రియేట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే ఓవియాను టార్గెట్‌ చేస్తూ విజయ్‌ ఫ్యాన్స్‌ భారీగా పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement