
ఉన్నట్టుండి సడన్‌గా 'కాంతార ఛాప్టర్ 1' సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివిటీ కనిపిస్తోంది. 'బాయ్ కాట్ కాంతార' అంటూ ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ సృష్టించి హడావుడి చేస్తున్నారు. తెలుగు చిత్రాలని కర్ణాటకలో ఆదరించట్లేదు మనమెందుకు ఆ చిత్రాల్ని ఎంకరేజ్ చేయాలి? హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే సదరు హీరో తెలుగులో మాట్లాడలేదు ఇంత పొగరా? అని రకరకాల కారణాలు చెప్పి మూవీపై వ్యతిరేకత పెంచే పనిచేస్తున్నారు కొందరు. ఇంతకీ అసలేం జరుగుతోంది? దీని వెనక ఎవరున్నారు?
రిషభ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో రిలీజై బ్లాక్‌బస్టర్ అందుకున్న చిత్రానికి ఇది ప్రీక్వెల్. అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. అయినా సరే ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి సడన్‌గా దీనిపై వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే దీని వెనక ఓ తెలుగు హీరో ఫ్యాన్స్ ఉన్నారా అనే సందేహం కలుగుతోంది.
(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?)
ఎందుకంటే మొన్నీమధ్య కర్ణాటకలో ఓ తెలుగు మూవీ రిలీజ్ అయింది. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ బయటున్న సదరు సినిమా పోస్టర్స్‌ని కొందరు వ్యక్తులు చించేశారు. మరోవైపు తొలిరోజు తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో సదరు చిత్రానికి ఏమంత చెప్పకోదగ్గ వసూళ్లు రావటం లేదు. తొలిరోజు ఘనంగా ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్ అని పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ.. రెండో రోజు నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. చూస్తుంటే అభిమానులు తప్పితే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదా అనిపిస్తుంది. ఇప్పుడు గానీ 'కాంతార 1' రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ మూవీని జనాలు మరిచిపోవడం గ్యారంటీ!
మరి కారణం ఇదేనో ఏమో తెలీదు గానీ 'బాయ్ కాట్ కాంతార' అని కావాలనే ట్రెండ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయినా సినిమా బాగుంటే ఆడుతుంది లేదంటే ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంది. కానీ అంతకంటే ముందే ఏదో మనసులో పెట్టుకుని 'కాంతార'ని టార్గెట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది! చెప్పాలంటే తమిళనాడులోనూ తెలుగు చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండదు. చేస్తే తమిళ డబ్బింగ్ చిత్రాలకు కూడా ఇలా ట్రెండ్ చేయాలి కదా! కానీ ఈ మధ్య కాలంలో అలాంటివే కనిపించలేదు. మరి కేవలం 'కాంతార'నే ఎందుకు టార్గెట్ చేసినట్లు?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం)