
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin ) తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’ 2898 ఏడీ’(Kalki 2898 AD) ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో రిలీజైన అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ సమయంలోనే ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన వర్క్‌పైనే నాగ్ అశ్విన్ ఇన్నాళ్లు దృష్టి పెట్టాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని భావిస్తున్నవేళ ప్రభాస్ ఫ్యాన్స్‌కి నాగ్ చిన్నపాటి షాక్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుని కొన్నాళ్ల పాటు పక్కకు పెట్టి.. ఓ లేడి ఓరియెంటెండ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.
ఆలియా అవుట్.. సాయి పల్లవి ఇన్?
కల్కి చిత్రానికి కంటే ముందే నాగ్ అశ్విన్ ఓ లేడీ ఓరియెంటెండ్ స్టోరీ రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌కి కథ కూడా వినిపించాడట. ఆమె కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి ఆలియా తప్పుకుందట. డేట్స్ కుదరకపోవడంతో నాగ్ అశ్విన్‌కి నో చెప్పేసిందట. దీంతో నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ కథను సాయి పల్లవి(sai Pallavi)తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇప్పటికే సాయి పల్లకి స్టోరీ నెరేట్ చేశాడని..ఆమె కూడా ఒప్పుకుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
కల్కి 2 ఎప్పుడు?
వాస్తవానికి నాగ్ అశ్విన్ ఇప్పుడు కల్కి 2 చిత్రాన్నే తెరకెక్కించాలి. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించారు. అయితే ప్రభాస్ డేట్స్ కుదరడం లేదట. ప్రస్తుతం ఆయన రాజాసాబ్(పాటలు), ఫౌజీ సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే ‘స్పిరిట్’ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. మరోవైపు సలార్ 2 స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. వీటి తర్వాతే కల్కి 2కి ప్రభాస్ డేట్స్ ఇచ్చే చాన్స్ ఉంది.
ఈ లెక్కన దాదాపు ఏడాది వరకు ప్రభాస్(Prabhas) డేట్స్ దొరకడం కష్టమే. మరోవైపు ఈ సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించారు. ఇప్పుడు కొత్త హీరోయిన్‌ని ఎంపిక చేయాలి. దీనికి కొంత సమయం పడుతుంది. అందుకే నాగ్ అశ్విన్ ఈ గ్యాప్‌లో మరో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్ కూడా ఖాలీగానే ఉన్నాయట. ‘రామాయణ్’ మినహా ఆమె చేతిలో మరో చిత్రమేది లేదు. నాగీ కూడా వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే నాగ్ అశ్విన్- సాయి పల్లవిల సినిమాను తెరపై చూడొచ్చు.