
స్టార్ హీరోయిన్ సమంత(samantha) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీస్ పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’(subham movie) మే 9న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాన వేసుకొని ముందుకు సాగుతోంది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్‌కి తన స్నేహితులను కూడా వాడుకుంటుంది.
తాజా వెన్నెల కిశోర్‌తో కలిసి ఓ ఫన్ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో సమంత ‘ నా శుభం మూవీ ప్రీమియర్స్‌కి రావట్లేదా’ అని అడుగుతుంది. వెన్నెల కిశోర్ ఏమో తన నటించిన ‘సింగిల్’(#single) మూవీ కూడా అదే రోజు(మే 9) రాబోతుందని చెప్పాలనుకుంటాడు.
కానీ సమంత అతన్ని మాట్లాడనీయకుండా.. ‘నువ్వు, నీ ఫ్యామిలీ తప్పకుండా వస్తారు కదా? నేను నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది తప్పుకుండా రావాలి’ అంటూ గబగబా మాట్లాడేస్తుంది. చివరికి నువ్వు కచ్చితంగా వస్తున్నావు అని కట్ చేసేస్తది. ఈ వీడియోని సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. సింగిల్ ఫోన్ కాల్‌లో వెన్నెల కిశోర్‌కి శుభం చెప్పేశా.. మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.