
హీరోయిన్లు అందాన్ని కాపాడుకోవడానికి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. ఇందుకోసం కొందరు నోరు కూడా కుట్టుకుంటున్నారని చెప్పవచ్చు. అలాంటి నటీమణుల్లో రష్మిక మందన్న కూడా ఉన్నారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత తెలుగు, తమిళం ఇటీవల హిందీ భాషలోనూ నటిస్తూ పాన్ ఇండియా క్రష్ గా మారారు. అతి తక్కువ కాలంలోనే అంటే కేవలం 9 ఏళ్లలోనే పాన్ ఇండియా కథానాయకిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తెలుగు చిత్రం పుష్ప– 2 రష్మిక మందన్న పాన్ ఇండియా కథానాయకిగా మార్చితే, బాలీవుడ్ లో నటించిన యానిమల్ చిత్రం మరింత స్థాయిని పెంచింది. కాగా 29 ఏళ్ల ఈ పరువాల భామ ఫిట్నెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కాగా ఓ భేటీలో తన ఫిట్నెస్ గురించి రష్మిక మందన్న తెలుపుతూ ఉదయాన్నే లేవగానే లీటర్ నీళ్లు తాగుతానన్నారు. ఆ తర్వాత డైటీషియన్ ఇచ్చే యాపిల్ సైడర్ వినీగర్ సేవిస్తానన్నారు. ఇప్పుడు తాను శాకాహారిగా మారినట్లు చెప్పారు. అందువల్ల మాంసాహారం జోలికి వెళ్లడం లేదని, అదేవిధంగా వరి అన్నాన్ని ఎక్కువగా తీసుకోనని చెప్పారు. రాత్రిపూట కూడా ఆహారాన్ని తక్కువగా తీసుకుంటానని చెప్పారు. ముఖ్యంగా టమాటో , బంగాళదుంప, దోసకాయ వంటి కాయగూరల్లో ఎలర్జీ ఉంటుందన్నారు. అందువల్ల వాటిని తినడం మానేశానన్నారు. ఇకపోతే నిత్యం సాయంకాలం శారీరక కసరత్తులు చేస్తానని రష్మిక మందన్నా తన ఫిట్నెస్ రహస్యం గురించి చెప్పారు. కాగా చివరిగా ఈ బ్యూటీ నటించిన చిత్రం కుబేర. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంతోపాటూ హిందీలో తమా, కాక్‌టైల్ 2 చిత్రాలు చేస్తున్నారు.

అదేవిధంగా రాఘవ లారెనన్స్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడుగా నటిస్తున్న కాంచన 4 చిత్రంలోని రష్మిక కీలకపాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. కాగా నటి రష్మిక మందన్నా మరో హిందీ చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. బాలీవుడ్లో సూపర్ హీరో కథాంశంతో రూపొందిన క్రిష్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఇప్పటికే మూడు భాగాలు రూపొందాయి. కాగా తాజాగా క్రిష్ –4 తెరకెక్కనుందని అందులో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రోతో కలిసి నటి రష్మిక మందన్న నటించనున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది.