సాక్షీ మడోల్కర్, సాయిదుర్గా తేజ్, రోషన్ కనకాల, టీజీ విశ్వప్రసాద్
రోషన్ కనకాల, సాక్షీ మడోల్కర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో సాయిదుర్గా తేజ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పట్నుంచి మోగ్లీ క్యారెక్టర్‌ను చూస్తూ పెరిగాను. ఈ రోజు ఆ టైటిల్‌తో సినిమా రావడం అనేది చాలా ఆనందాన్నిచ్చింది. ఇండస్ట్రీలో హార్డ్‌వర్క్ మాత్రమే మాట్లాడుతుంది.
రోషన్ అద్భుతంగా నటించాడు. రోషన్ మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. బండి సరోజ్‌గారు బాగా యాక్ట్ చేశారు. సందీప్‌గారు ఈ సినిమాను అద్భుతంగా తీశారు’’ అని అన్నారు. ‘‘నాకు సినిమా అంటే ప్రాణం... పిచ్చి. సుమారాజీవ్‌ల కొడుకు కదా... తనకు అంతా ఈజీగా జరిగిపోతుంది అనే మాటలు విన్నాను. నిజానికి అందరు హీరోలూ, వారి అభిమానులు నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అయితే దీనికి మించి తలరాత ఉంటుంది. ఎవరి తలరాత వాళ్ల చేతుల్లోనే ఉంటుంది.
దానిని నిర్వచించేది హార్డ్‌వర్క్, టాలెంట్, డిసిప్లెయిన్. ఈ మూడు మాత్రమే విజయాన్ని నిర్ణయిస్తాయి. నా హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ నేను పెట్టాను. ప్రాణం పెట్టి పని చేశాను. ‘మోగ్లీ 2025’ సినిమాను గెలిపించిన అందరికీ థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘మేం చిన్న సినిమా తీశాం. కానీ ఆడియన్స్ పెద్ద సక్సెస్ ఇచ్చారు’’ అని చెప్పారు టీజీ విశ్వప్రసాద్. హీరోయిన్ సాక్షి, దర్శకుడు హేమంత్ మధుకర్ మాట్లాడారు.


