'గర్ల్‌ఫ్రెండ్' కోసం వస్తున్న బాయ్ ఫ్రెండ్ | Vijay Deverakonda to Join Rashmika at 'The Girlfriend' Success Meet Amid Engagement Buzz | Sakshi
Sakshi News home page

Rashmika: నిశ్చితార్థం గురించి అఫీషియల్‌గా చెబుతారా?

Nov 11 2025 2:19 PM | Updated on Nov 11 2025 2:35 PM

Vijay Devarakonda Attends Rashmika Girlfriend Movie Event

పాన్ ఇండియా సెన్సేషన్ హీరోయిన్ రష్మిక.. గత 11 నెలల్లో ఐదు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీసెంట్‌గా అయితే 'ద గర్ల్‌ఫ్రెండ్' మూవీతో వచ్చింది. దీనికి అన్నివైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు రష్మిక కోసం స్వయంగా విజయ్ దేవరకొండ కూడా రాబోతున్నాడు.

(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)

'గర్ల్‌ఫ్రెండ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్.. సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండని తీసుకొస్తానని అన్నారు. ఇప్పుడు అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం సక్సెస్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని టాక్. సాధారణంగా చూస్తే ఇందులో పెద్ద విషయమేం ఉండదు. కానీ గతకొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నాళ్ల క్రితమే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయం అనధికారికంగా బయటకొచ్చినా విజయ్ గానీ రష్మిక గానీ బయటపడట్లేదు.

ఎంగేజ్‌మెంట్ రూమర్స్ తర్వాత విజయ్-రష్మిక కలిసి తొలిసారి స్టేజీపై కనిపించబోతున్నారు. మరి ఇద్దరిలో ఎవరైనా ఈ విషయం గురించి మాట్లాడుతారా అనేది చూడాలి? మరోవైపు విజయ్-రష్మికల పెళ్లి గురించి కూడా అప్పుడే రూమర్స్ వచ్చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని అంటున్నారు. ఇప్పుడు కనిపించబోతున్న ఈవెంట్‌లో వివాహం గురించి కూడా ఏమైనా హింట్ ఇస్తారా అనేది చూడాలి.

(ఇదీ చదవండి: ట్రెండింగ్‌ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement