వారియర్‌ లుక్‌లో రష్మిక.. పాటతో అలరించిన విజయ్‌ దేవరకొండ! | Rashmika Mandanna The Girlfriend Movie Reyi Lolothula Song Teaser Audio Out Now, Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

The Girlfriend: వారియర్‌ లుక్‌లో రష్మిక.. పాటతో ఆకట్టుకున్న విజయ్‌ దేవరకొండ!

Apr 5 2025 5:49 PM | Updated on Apr 5 2025 6:02 PM

Reyi Lolothula Teaser Audio Out From The Girlfriend

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

ఈ రోజు(ఏప్రిల్‌ 5)రష్మిక బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్"(The Girlfriend) సినిమా నుంచి విశెస్ చెబుతూ కొత్త పోస్టర్, టీజర్ సాంగ్ 'రేయి లోలోతుల' రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రష్మిక వారియర్ లుక్ లో గన్, కత్తితో పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. 'రేయి లోలోతుల' పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు. 

ఈ పాటలో వచ్చే పోయెమ్ ను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాశారు. 'రేయి లోలోతుల' పాట ఎలా ఉందో చూస్తే - 'రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ  పాట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement