'అందాల రాక్షసి' హీరోగా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన రాహుల్ రవీంద్రన్.. ఇప్పుడు ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. మరోవైపు దర్శకుడిగానూ హిట్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. పాన్ ఇండియా సెన్సేషన్ రష్మికతో 'ద గర్ల్ ఫ్రెండ్' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ తీశాడు. ఈ శుక్రవారం ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్.. తన భార్య తాళిబొట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నాకు పెళ్లి అయిన తర్వాత.. మంగళసూత్రం (తాళి) మెడలో వేసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయమే అని నా భార్య చిన్మయికి చెప్పాను. నేనైతే తాళి వేసుకోవద్దనే చెబుతాను. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళిబొట్టు ఉన్నట్లు అబ్బాయిలకు ఏం ఉండదు. ఇది ఓ వివక్ష లాంటిదే. మగవారికి లేని నిబంధన మహిళలకు మాత్రమే ఉండటం సరికాదు' అని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)
రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వాటిని కూడా పాజిటివ్‌గానే తీసుకుంటున్నాడు. తాజాగా రాహుల్ ఇలా అన్నాడని చెప్పి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దానికి స్పందించిన ఓ నెటిజన్.. 'నీ మీదున్న గౌరవం పోయింది రాహుల్ అన్న' అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన రాహుల్.. 'ఒకరి మాటలతో ఏకీభవించకపోవడం, ఒకరిపై గౌరవం పోవడం ఓకే బడ్డీ. కానీ నువ్వు ఈ విషయాన్ని కూడా గౌరవంగా సంభోదిస్తూ చెప్పావ్ చూడు. ఆ విషయంలో నిన్ను మెచ్చుకుంటున్నాను' అని అన్నాడు.
'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా విషయానికొస్తే.. రష్మిక లీడ్ రోల్ చేసింది. దీక్షిత్ శెట్టి ఈమె సరసన నటించాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ప్రేమకథనే అయినప్పటికీ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండబోతుందనిపిస్తోంది. రాహుల్ నటుడే అయిప్పటికీ గతంలో 'చిలసౌ' అనే మూవీతో దర్శకుడిగా మారాడు. హిట్ కొట్టాడు. తర్వాత 'మన్మథుడు 2' తీశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు డైరెక్టర్‌గా వస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికొస్తే సింగర్ చిన్మయిని రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
