breaking news
Rahul Ravidran
-
నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్
'అందాల రాక్షసి' హీరోగా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన రాహుల్ రవీంద్రన్.. ఇప్పుడు ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. మరోవైపు దర్శకుడిగానూ హిట్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. పాన్ ఇండియా సెన్సేషన్ రష్మికతో 'ద గర్ల్ ఫ్రెండ్' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ తీశాడు. ఈ శుక్రవారం ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్.. తన భార్య తాళిబొట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'నాకు పెళ్లి అయిన తర్వాత.. మంగళసూత్రం (తాళి) మెడలో వేసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయమే అని నా భార్య చిన్మయికి చెప్పాను. నేనైతే తాళి వేసుకోవద్దనే చెబుతాను. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళిబొట్టు ఉన్నట్లు అబ్బాయిలకు ఏం ఉండదు. ఇది ఓ వివక్ష లాంటిదే. మగవారికి లేని నిబంధన మహిళలకు మాత్రమే ఉండటం సరికాదు' అని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వాటిని కూడా పాజిటివ్‌గానే తీసుకుంటున్నాడు. తాజాగా రాహుల్ ఇలా అన్నాడని చెప్పి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దానికి స్పందించిన ఓ నెటిజన్.. 'నీ మీదున్న గౌరవం పోయింది రాహుల్ అన్న' అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన రాహుల్.. 'ఒకరి మాటలతో ఏకీభవించకపోవడం, ఒకరిపై గౌరవం పోవడం ఓకే బడ్డీ. కానీ నువ్వు ఈ విషయాన్ని కూడా గౌరవంగా సంభోదిస్తూ చెప్పావ్ చూడు. ఆ విషయంలో నిన్ను మెచ్చుకుంటున్నాను' అని అన్నాడు.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా విషయానికొస్తే.. రష్మిక లీడ్ రోల్ చేసింది. దీక్షిత్ శెట్టి ఈమె సరసన నటించాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ప్రేమకథనే అయినప్పటికీ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండబోతుందనిపిస్తోంది. రాహుల్ నటుడే అయిప్పటికీ గతంలో 'చిలసౌ' అనే మూవీతో దర్శకుడిగా మారాడు. హిట్ కొట్టాడు. తర్వాత 'మన్మథుడు 2' తీశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు డైరెక్టర్‌గా వస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికొస్తే సింగర్ చిన్మయిని రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
నేను జీవితాంతం ప్రేమించే వ్యక్తి అతనే : సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అనారోగ్యం కారణంగా కొంతకాలం షూటింగ్స్‌కి దూరమైన సామ్.. ఇప్పుడు పూర్తిగా కోలుకొని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేందుకు సిద్దమైంది. ప్రస్తుతం ‘సీటడెల్’అనే వెబ్‌సిరీస్ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్లో పాల్గొననుంది. ఇలా వరుస షూటింగ్స్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాకి టైమ్ కేటాయిస్తుంది సామ్. ఖాలీ సమయం దొరికితే చాలు.. నెట్టింట్లో వాలిపోయి అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంటుంది.తాజాగా తన బెస్ట్‌ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ ఫోటోని షేర్ చేస్తూ..అతని గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. (చదవండి: రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?) ‘మీకు తెలిసిన మంచి వ్యక్తిని తీసుకుని వందసార్లు మల్టిప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్. రాహుల్ నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటాను’ అని సామ్ చెప్పుకొచ్చింది. రాహుల్ రవీంద్రన్ టేస్టీ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్న పిక్ షేర్ చేస్తూ.. తను ఫుడీ అయినప్పటికీ మీతో కంపెనీ ఇవ్వడానికి దాన్ని వదులుకుంటాడు. కానీ ఎంత బాధపడతాడో’ అని సరదాగా పేర్కొంది. రాహుల్, ఆమె భార్య చిన్మయి ఇద్దరూ సమంతకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. రాహుల్, సామ్ కలిసి ఓ తమిళ చిత్రంలో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరు స్నేహితులయ్యారు. తన సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పడంతో చిన్మయి కూడా సామ్‌కి క్లోజ్ అయింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మే 6న గాయని చిన్మయి వివాహం
అమె మాటలో ఓ విధమైన మత్తు ఉంది. మరీ చెప్పాలంటే గమ్మత్తు ఉంది. ఆమె ఏ హీరోయిన్‌కి అయిన డబ్బింగ్ చెప్పిందంటే .. ఆ హీరోయిన్ వెండి తెర మీద వెలిగిపోవాల్సిందే. ఆ డబ్బింగ్ కమ్ సింగర్ చిన్మయి శ్రీపాద. చిన్మయి వివాహం మే ఆరో తేదీన చెన్నైలో జరగనుంది. తమిళంతోపాటు, తెలుగు, హిందీ భాషాల్లో వెయ్యి పాటలను పాడిన చిన్మయి, అందాల రాక్షసి ఫేం నటుడు రాహుల్ రవీంద్ర గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతించి.. వివాహ ముహూర్తం నిశ్చయించారు. మే నెల 6వ తేదీన చెన్నైలోని నక్షత్ర హోటల్లో రాహుల్ రవీంద్ర, చిన్మయిల వివాహం వేడుకగా జరగనుంది. సరసర సాలై కాట్రు, సహానా సారల్ తూవుదో, కిళి మాంజారో వంటి పాటల ద్వారా ప్రాచుర్యం పొందిన గాయని చిన్మయి. ప్రముఖ హీరోయిన్ సమంతాకు తొలి చిత్రం ఏమాయ చేసావే నుంచి అన్ని చిత్రాలకు చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. తమ పెళ్లికి విచ్చేసే బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఆ కొత్త జంట ఓ వినూత్నమైన విజ్ఞప్తి చేశారు. తమకు ఎటువంటి బహుమతులు, బోకేలు, ఇతరత్రా కోసం నగదును నిరూపయోగంగా ఖర్చు చేయవద్దని కోరారు. అలా ఖర్చు చేసే నగదును లడక్‌లోని 17,000 ft Foundation కు డోనేట్ చేయాలి కోరారు.


