నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'ది గర్ల్‌ఫ్రెండ్‌' | The Girlfriend Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

The Girlfriend Movie: ఓటీటీలో 'ది గర్ల్‌ఫ్రెండ్‌'.. ఈ వారమే స్ట్రీమింగ్‌

Nov 30 2025 11:40 AM | Updated on Nov 30 2025 12:39 PM

The Girlfriend Movie OTT Release Date Out

ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్‌ కలిస్తే జనం చప్పట్లు కొడతారు. కానీ, ఈ సినిమాలో మాత్రం వాళ్లిద్దరికీ బ్రేకప్‌ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆ మూవీయే ది గర్ల్‌ఫ్రెండ్‌. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా, దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.

నెల తిరగకముందే ఓటీటీలో
నవంబర్‌ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్‌ 5న అందుబాటులోకి వస్తున్నట్లు వెల్లడించారు. నెలరోజులు కాకముందే ది గర్ల్‌ఫ్రెండ్‌ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట! తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమ్‌ అవనుంది. ఇది చూసిన అభిమానులు.. ఈ మూవీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో అని కామెంట్లు చేస్తున్నారు.

కథేంటంటే?
The Girlfriend Movie: భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్‌)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్‌ (దీక్షిత్‌ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్‌) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్‌ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్‌ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్‌ కంట్రోల్‌లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ. ఈ శుక్రవారం ఎంచక్కా ఓటీటీలో గర్ల్‌ఫ్రెండ్‌ చూసేయండి..

 

 

చదవండి: బ్రహ్మానందంపై నోరు జారిన రాజేంద్రప్రసాద్‌.. అంతమాటన్నాడా?

Advertisement
 
Advertisement
Advertisement