breaking news
Dheekshith Shetty
-
నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'ది గర్ల్‌ఫ్రెండ్'
ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్ కలిస్తే జనం చప్పట్లు కొడతారు. కానీ, ఈ సినిమాలో మాత్రం వాళ్లిద్దరికీ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆ మూవీయే ది గర్ల్‌ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా, దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.నెల తిరగకముందే ఓటీటీలోనవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5న అందుబాటులోకి వస్తున్నట్లు వెల్లడించారు. నెలరోజులు కాకముందే ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట! తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమ్ అవనుంది. ఇది చూసిన అభిమానులు.. ఈ మూవీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో అని కామెంట్లు చేస్తున్నారు.కథేంటంటే?The Girlfriend Movie: భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్‌ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ. ఈ శుక్రవారం ఎంచక్కా ఓటీటీలో గర్ల్‌ఫ్రెండ్ చూసేయండి.. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: బ్రహ్మానందంపై నోరు జారిన రాజేంద్రప్రసాద్.. అంతమాటన్నాడా? -
‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. ముఖ్య అతిథిగా విజయ్ (ఫొటోలు)
-
‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ (ఫొటోలు)
-
రష్మికది చాలా మంచి మనసు
‘‘రష్మికని నేను ‘గీత గోవిందం’ సినిమా నుంచి చూస్తున్నా.. నిజ జీవితంలోనూ తను భూమానే. తను ఇన్నోసెంట్. తన గురించి ఆలోచించదు.. సెట్స్‌లో అందరూ సంతోషంగా ఉండాలి.. డైరెక్టర్ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తుంటుంది. డైరెక్టర్ ఏది చేయమంటే అది చేస్తుంటుంది. తన ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ‘నన్ను ఎవడన్నా ఏదైనా గెలికితే నేను మళ్లీ రివర్స్‌లో వెళతాను. కానీ, రష్మిక ఏంటంటే... ప్రపంచంలో ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా తన పనిపైనే దృష్టి పెడుతుంది.. అంత మంచి మనసు తనది. తను నిజంగా అమేజింగ్ ఉమన్’’ అని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 20.4 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నన్ను ఎంత భావోద్వేగానికి గురి చేసిందంటే చాలా చోట్ల కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. చాలా సన్నివేశాల్లో మనసు బరువెక్కిన అనుభూతి కలిగింది. ఈ మధ్య నేను చూసిన గొప్ప చిత్రాల్లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఒకటి. ఈ సినిమా ఇటు ఇండియాలో అటు విదేశాల్లో హ్యూజ్ సక్సెస్ అందుకుంది. ఇలాంటి సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమాని నంబర్స్‌తో పోల్చలేం. ఈ చిత్రం సమాజంలో అవేర్నెస్ తీసుకొస్తుంది. ఈ సినిమాకి పని చేసిన అందరూ మీ లైఫ్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి మూవీ చేసి జీవితం పరిపూర్ణం చేసుకున్నారు’’ అని చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్ ఫ్రెండ్’కి హీరో మా డైరెక్టర్ రాహుల్. మా ‘గీత గోవిందం’లో నటించిన రష్మిక.. ‘ది గర్ల్ ఫ్రెండ్’తో మా సంస్థకు వన్నె తెచ్చింది’’ అని పేర్కొన్నారు. రష్మికా మందన్నా మాట్లాడుతూ– ‘‘ది గర్ల్‌ఫ్రెండ్’లో నేను చేసిన భూమా పాత్రలో ఏం జరిగిందో నా జీవితంలోనూ అలానే జరిగింది. మనందరి జీవితాల్లోనూ జరిగి ఉంటుంది. ఈ చిత్రం కోసం మొదటిసారి రాహుల్‌కి సరెండర్ అయిపోయి పనిచేశాను. ఈ సినిమాని మీరు (ప్రేక్షకులు) అర్థం చేసుకున్నారు.. బాగా కనెక్ట్ అయ్యారు.. అదే నాకు పెద్ద అవార్డుతో సమానం. ఈ సినిమాలో మొదటి నుంచి విజయ్ భాగమయ్యారు. తనలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి’’ అని తెలిపారు. ‘‘భూమా పాత్రలో నటించడం ద్వారా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇచ్చారు రష్మిక’’ అన్నారు విద్య కొప్పినీడి. ‘‘మా సినిమాకి ప్రేక్షకులు ఇస్తున్న ప్రశంసలతో జాతీయ అవార్డు పొందినంత సంతోషంగా ఉంది’’ అని ధీరజ్ మొగిలినేని పేర్కొన్నారు. ‘‘నా గత సినిమా (మన్మథుడు 2) రిలీజై ఆరేళ్లయింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఫలితం అనుకున్నట్లు రాకుంటే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అని భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రశాంత్ విహారి, హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్, పాటల రచయిత రాకేందు మౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, నటి రోహిణి తదితరులు మాట్లాడారు. -
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ
నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girlfriend Review). రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్, ఎమోషనల్ లవ్‌స్టోరీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌తో పాటు పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’పై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..భూమా(రష్మిక) తండ్రి(రావు రమేశ్)చాటున పెరిగిన ఓ అమాయకపు అమ్మాయి. ఎంఏ లిటరేచర్ చదవడం కోసం తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వచ్చి రామలింగయ్య ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో జాయిన్ అవుతుంది. విక్రమ్(దీక్షిత్ శెట్టి), దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) కూడా అదే కాలేజీలో చేరతారు.విక్రమ్ ఆవేశపరుడు. అంతేకాదు అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలనుకునే స్వభావం కలవాడు. తనకు నచ్చినట్లుగా భూమా ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు అదే కాలేజీకి చెందిన మరో అమ్మాయి దుర్గ(అనూ ఇమ్మాన్యుయేల్)..విక్రమ్‌ని ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం ఆమెను నిరాకరిస్తూ ఉంటాడు. లవ్, రిలేషన్‌కు దూరంగా ఉండాలనుకుంటూనే..భూమా కూడా విక్రమ్‌తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన లైఫ్ మొత్తం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలిసిన తర్వాత భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? వాటిని అధిగమించి ఎలా సక్సెస్ అయిందనేదే మిగతా కథ(The Girlfriend Review)ఎలా ఉందంటే..అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి.. ఇలాంటి పనులే చేయాలని చెప్పే ‘మగమహారాజులు’ చాలా మందే ఉన్నారు. బయట నీతులు మాట్లాడి..ఇంట్లో ఆడవాళ్లకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని భర్తలు.. ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్లోకి తీసుకొని.. మాటలతో హింసించే బాయ్‌ప్రెండ్స్ ఇప్పటీకీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. అలాంటి బాధలన్నీ భరించి.. ఎదురించి చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్‌ఫ్రెండ్’. మనల్ని కంట్రోల్ చేసే పవర్‌ని ఇతరులకు ఇవ్వొద్దని, కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలి అని చెప్పే సినిమా ఇది. కథగా చూస్తే..ఇది చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ. కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. విజువల్స్ ద్వారానే తను చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే రష్మిక షవర్ సీన్, హీరో అమ్మగారితో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిరర్ విజువల్, బ్రేకప్ తర్వాత హీరో గ్యాంగ్ వెంబడించినప్పు వచ్చే సింబాలిక్ షాట్స్.. ఇవన్నీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభను చాటిచెబుతాయి.ఇదంతా ఒకవైపు.. ఇక లాజిక్కులు, ప్రస్తుత సమాజంలోని వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే.. పాత చింతకాయపచ్చడి కథేలాగే కనిపిస్తుంది. అంతేకాదు నాణానికి ఒకవైపే చూపించాడని.. రెండో వైపు కూడా ఉంటుంది కదా..దర్శకుడు అదేలా మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం మగవాళ్లను బ్యాడ్ చేయడానికే ఈ సినిమా తీశాడనే విమర్శలు కూడా దర్శకుడిపై వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్ పాత్రతో కనెక్ట్ అవ్వడం ఖాయం. ఇద్దరీ పాత్రలూ.. మనం ఎక్కడో చూసినట్లుగా, విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. ఫస్టాఫ్ మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే.. సెకండాఫ్ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే చూపించారు. ఊహకందేలా కథనం సాగినా..తెరపై ఆయా సన్నివేశాలను చూస్తుంటే..కొన్ని చోట్ల ఎమోషనల్ అవుతాం. క్లైమాక్స్‌లో హీరోయిన్ చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నేటి తరం యువకులను ఆలోచింపజేస్తాయి. అక్కడక్కడ లాజిక్ మిస్ అవ్వడంతో పాటు ల్యాగ్ చేసినా..‘ది గర్ల్‌ఫ్రెండ్’ని మాత్రం ఓ వర్గం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలోని భూమా పాత్రకు రష్మికను ఎంచుకోవడంలోనే రాహుల్ సగం విజయం సాధించాడు. ఆ పాత్రకు రష్మిక తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అన్నట్లుగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె అద్బుతంగా నటించింది. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి ఒదిగిపోయాడు. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. చాలా బాగా నటించింది. రావు రమేశ్ ఒకటి రెండు షాడ్స్తో కనిపించినా..తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ పాటలు, ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం రెండూ ఈ సినిమా స్థాయిని పెంచేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది.ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కురిసే వాన తడిపేయాలన్ని భూమే ఏదో.. అంటూ సాగే మూడో లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్‌కు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా.. ఈ రొమాంటిక్ లిరికల్ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. కాగా.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. -
'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్: బ్రేక్ తీసుకుందామా?
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend Movie). హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. శనివారం (అక్టోబర్ 25న) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.అదిరిపోయిన ట్రైలర్అందులో 'మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? చిన్న అంటే చిన్న కాదు.. ఒక బ్రేక్‌లా..' అని రష్మిక డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. నువ్వు విక్రమ్‌తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? విక్రమ్కైతే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్.. కానీ, వాడు నీకు కరెక్ట్ కాదు అని రష్మికకు సలహా ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. ఇక మరో సీన్లో.. ఇంత క్యారెక్టర్‌లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడు అంటూ రావు రమేశ్.. రష్మిక చెంప పగలగొట్టాడు. అలా ఫుల్ ఎమోషనల్‌గా ట్రైలర్ కొనసాగింది. ఆ ట్రైలర్ మీరూ చూసేయండి..


