కన్నడ హీరో దీక్షిత్‌శెట్టి నటిస్తోన్న తాజా చిత్రం శబర. ఈ మూవీకి కిలారు ప్రేమ్ చంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మిషా నారంగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే బంగారం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఓ ప్రపంచమంతా బంగారమే ఉందని తెలిసినప్పుడు.. ఎన్ని యుద్ధాలు జరిగి ఉంటాయ్? ఎన్ని ప్రాణాలు పోయింటాయి? ఈ నేల ఎంత రక్తాన్ని చూసి ఉంటుంది? అనే డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. రక్తం చూడని యుద్ధం ఉంటుందా? అనే డైలాగ్, విజువల్స్‌తో టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్ భగత్, రాజీవ్ గోవింద పిళ్లై, కృతికా సింగ్ యాదవ్, భూషణ్ కళ్యాణ్, ఆరుష్, ప్రమోదిని, శుభం తోమర్, శ్రీకాంత్, అనిరుధ్ అరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి మిధున్ ముకుందన్ సంగీతమందిస్తున్నారు.


