రష్మికది చాలా మంచి మనసు  | Vijay Deverakonda to attend The Girlfriend Movie Grand success celebration | Sakshi
Sakshi News home page

రష్మికది చాలా మంచి మనసు 

Nov 13 2025 4:20 AM | Updated on Nov 13 2025 4:20 AM

Vijay Deverakonda to attend The Girlfriend Movie Grand success celebration

– విజయ్‌ దేవరకొండ

‘‘రష్మికని నేను ‘గీత గోవిందం’ సినిమా నుంచి చూస్తున్నా.. నిజ జీవితంలోనూ తను భూమానే. తను ఇన్నోసెంట్‌. తన గురించి ఆలోచించదు.. సెట్స్‌లో అందరూ సంతోషంగా ఉండాలి.. డైరెక్టర్‌ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తుంటుంది. డైరెక్టర్‌ ఏది చేయమంటే అది చేస్తుంటుంది. తన ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ‘నన్ను ఎవడన్నా ఏదైనా గెలికితే నేను మళ్లీ రివర్స్‌లో వెళతాను. కానీ, రష్మిక ఏంటంటే... ప్రపంచంలో ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా తన పనిపైనే దృష్టి పెడుతుంది.. అంత మంచి మనసు తనది. తను నిజంగా అమేజింగ్‌ ఉమన్‌’’ అని హీరో విజయ్‌ దేవరకొండ తెలిపారు.

 రష్మికా మందన్నా, దీక్షిత్‌ శెట్టి జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్‌ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 20.4 కోట్లు గ్రాస్‌ వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ–‘‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా నన్ను ఎంత భావోద్వేగానికి గురి చేసిందంటే చాలా చోట్ల కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. 

చాలా సన్నివేశాల్లో మనసు బరువెక్కిన అనుభూతి కలిగింది. ఈ మధ్య నేను చూసిన గొప్ప చిత్రాల్లో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ఒకటి. ఈ సినిమా ఇటు ఇండియాలో అటు విదేశాల్లో హ్యూజ్‌ సక్సెస్‌ అందుకుంది. ఇలాంటి సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమాని నంబర్స్‌తో పోల్చలేం. ఈ చిత్రం సమాజంలో అవేర్‌నెస్‌ తీసుకొస్తుంది. ఈ సినిమాకి పని చేసిన అందరూ మీ లైఫ్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ లాంటి మూవీ చేసి జీవితం పరిపూర్ణం చేసుకున్నారు’’ అని చెప్పారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’కి హీరో మా డైరెక్టర్‌ రాహుల్‌. మా ‘గీత గోవిందం’లో నటించిన రష్మిక.. ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’తో మా సంస్థకు వన్నె తెచ్చింది’’ అని పేర్కొన్నారు. 

రష్మికా మందన్నా మాట్లాడుతూ– ‘‘ది గర్ల్‌ఫ్రెండ్‌’లో నేను చేసిన భూమా పాత్రలో ఏం జరిగిందో నా జీవితంలోనూ అలానే జరిగింది. మనందరి జీవితాల్లోనూ జరిగి ఉంటుంది. ఈ చిత్రం కోసం మొదటిసారి రాహుల్‌కి సరెండర్‌ అయిపోయి పనిచేశాను. ఈ సినిమాని మీరు (ప్రేక్షకులు) అర్థం చేసుకున్నారు.. బాగా కనెక్ట్‌ అయ్యారు.. అదే నాకు పెద్ద అవార్డుతో సమానం. ఈ సినిమాలో మొదటి నుంచి విజయ్‌ భాగమయ్యారు. తనలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటే అదొక బ్లెస్సింగ్‌ అనుకోవాలి’’ అని తెలిపారు.  

‘‘భూమా పాత్రలో నటించడం ద్వారా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇచ్చారు రష్మిక’’ అన్నారు విద్య కొప్పినీడి. ‘‘మా సినిమాకి ప్రేక్షకులు ఇస్తున్న ప్రశంసలతో జాతీయ అవార్డు పొందినంత సంతోషంగా ఉంది’’ అని ధీరజ్‌ మొగిలినేని పేర్కొన్నారు. ‘‘నా గత సినిమా    (మన్మథుడు 2) రిలీజై ఆరేళ్లయింది. ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఫలితం అనుకున్నట్లు రాకుంటే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అని భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు’’ అని రాహుల్‌ రవీంద్రన్‌ అన్నారు. ఈ వేడుకలో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ప్రశాంత్‌ విహారి, హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్, ప్రొడ్యూసర్స్‌ బన్నీ వాస్, ఎస్‌కేఎన్, డైరెక్టర్‌ సాయి రాజేశ్, పాటల రచయిత రాకేందు మౌళి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ శ్రావ్య వర్మ, నటి రోహిణి తదితరులు మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement