జపాన్‌లో ఇండియన్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే బాహుబలి మొదలుకొని కల్కి , ఆర్‌ఆర్‌ఆర్, దేవర వరకూ జపాన్‌లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'యానిమల్' సినిమా విడుదల కానుంది. 2023లో విడుదలైన ఈ మూవీ ఇండియాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక నటించారు.
సందీప్ రెడ్డి మునుపటి దర్శకత్వం వహించిన కబీర్ సింగ్ మాదిరిగానే, 'యానిమల్' మూవీపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే, ప్రేక్షకుల నుండి ఆదరణ లభించింది. ఆ ఏడాదలో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు జపాన్ సినిమా మార్కెట్‌ను యానిమల్ టార్గెట్ చేస్తుంది. 2026 ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కానున్నట్లు టీ-సీరిస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా తన సోషల్ మీడియాలో ఈ ప్రకటనను పంచుకున్నారు. యానిమల్ జపాన్‌కు చేరుకుందంటూ పేర్కొన్నారు.


