నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది.
ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కురిసే వాన తడిపేయాలన్ని భూమే ఏదో.. అంటూ సాగే మూడో లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్‌కు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా.. ఈ రొమాంటిక్ లిరికల్ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. కాగా.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది.


