నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. గతనెల థియేటర్లలో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగానే రాబట్టింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.
అయితే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీంతో ఈ మూవీకి థియేటర్ల వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఓ నెటిజన్ రష్మిక లుక్‌పై కామెంట్ చేశాడు. క్లైమాక్స్ సీన్‌లో ప్రత్యేకమైన లుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఆమె ముఖం, దుస్తులపై అన్ని రంగులు ఎందుకు? ఇది చాలా పవర్‌ఫుల్ మూవీనే.. కానీ అర్జున్ రెడ్డికి, ది గర్‌ఫ్రెండ్‌కి సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించాడు.
నెటిజన్ ప్రశ్నకు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ఈ మూవీకి ఏ సినిమాతోనూ సంబంధం లేదన్నారు. ఈ రంగులు ఆమెను సిగ్గుపడేలా, అవమానించడానికి విక్రమ్ ఉపయోగిస్తాడు.. అలా వాటిని స్వీకరించడం నేర్చుకుంది. అది ఆమెలో ఇప్పుడొక భాగమని కూడా తెలుసు.. ఆ అంగీకారమే తనను మరింత బలంగా, అజేయంగా చేసిందన్నారు. ఒకప్పుడు ఇంట్రావర్ట్‌గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు కళాశాల అందరి ముందు ఈ రంగులతో నిలబడటానికి ఆలోచించదు.. దాన్ని చెప్పడానికి ఉద్దేశించినదే ఆ రంగుల ఎంపిక. సింపుల్‌గా చెప్పాలంటే మరి నీకు లేని సిగ్గు నాకెందుకు రా యెదవ!అని చెప్పడమేనని రాహుల్ ట్విటర్‌లో రిప్లై ఇచ్చారు.
No buddy… it had nothing to do with any other movie. Vikram uses these colours/paint to shame and humiliate her. She has learnt to embrace it now. She knows it’s a part of her now. That acceptance makes her stronger, invincible even. And for someone who starts out as an… https://t.co/jfdcWe3Zh9
— Rahul Ravindran (@23_rahulr) December 7, 2025


