2009లో రోడ్డు ప్రమాదం.. నా ప్రాణాలు కాపాడింది వారిద్దరే: ఎన్టీఆర్‌ | JR NTR Remains 2009 road accident and who saved his life | Sakshi
Sakshi News home page

2009లో రోడ్డు ప్రమాదం.. నా ప్రాణాలు కాపాడింది వారిద్దరే: ఎన్టీఆర్‌

Mar 9 2026 8:04 AM | Updated on Mar 9 2026 9:39 AM

JR NTR Remains 2009 road accident and who saved his life

బెంగళూరులో ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవం కోసం ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ వెళ్లారు. ఆయన ఎయిర్ పోర్టు దిగినప్పటి నుంచి అభిమానుల తాకిడి మామూలుగా లేదు. సిటీ మొత్తం ఎక్కడ చూసినా సరే వాల్లే కనపించారు. తారక్‌ను దగ్గరగా చూసేందుకు  వేలాది మంది తరలివచ్చారు. తారక్‌ ఆసుపత్రి వద్దకు చేరుకోగాని భారీగా అభిమానులు గుమికూడారు.. వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. మొత్తానికి ఎలాగోలా రిబ్బన్ కట్ చేసి వేదికపై కొన్ని మాటలు పంచుకున్నారు. ఈ క్రమంలో 2009లో తనకు జరిగిన రోడ్‌ ప్రమాదం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఎలా ప్రాణాలతో బయటపడ్డారో తెలిపారు.

2009లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనను ప్రాణాలతో కాపాడింది కిమ్స్‌ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు భాస్కర్ రావు, ప్రముఖ వైద్యులు ఎ.వి. గురవారెడ్డి అని ఆయన గుర్తు చేసుకున్నారు. వారిద్దరికీ ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. 2009 మార్చి 26న  జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళుతుండగా, రాత్రి వేళ మోతె మండలకేంద్రం సమీపంలోని తిరుతమ్మగుడి మూలమలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జూనియర్ ఎన్టీఆర్‌తో సహా పలువురికి గాయాలు కాగా,  ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో తారక్‌ కూడా తీవ్రంగానే గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement