breaking news
AV gurava reddy
-
2009లో రోడ్డు ప్రమాదం.. నా ప్రాణాలు కాపాడింది వారిద్దరే: ఎన్టీఆర్
బెంగళూరులో ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవం కోసం ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు. ఆయన ఎయిర్ పోర్టు దిగినప్పటి నుంచి అభిమానుల తాకిడి మామూలుగా లేదు. సిటీ మొత్తం ఎక్కడ చూసినా సరే వాల్లే కనపించారు. తారక్‌ను దగ్గరగా చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. తారక్ ఆసుపత్రి వద్దకు చేరుకోగాని భారీగా అభిమానులు గుమికూడారు.. వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. మొత్తానికి ఎలాగోలా రిబ్బన్ కట్ చేసి వేదికపై కొన్ని మాటలు పంచుకున్నారు. ఈ క్రమంలో 2009లో తనకు జరిగిన రోడ్ ప్రమాదం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఎలా ప్రాణాలతో బయటపడ్డారో తెలిపారు.2009లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనను ప్రాణాలతో కాపాడింది కిమ్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు భాస్కర్ రావు, ప్రముఖ వైద్యులు ఎ.వి. గురవారెడ్డి అని ఆయన గుర్తు చేసుకున్నారు. వారిద్దరికీ ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. 2009 మార్చి 26న జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళుతుండగా, రాత్రి వేళ మోతె మండలకేంద్రం సమీపంలోని తిరుతమ్మగుడి మూలమలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జూనియర్ ఎన్టీఆర్‌తో సహా పలువురికి గాయాలు కాగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో తారక్ కూడా తీవ్రంగానే గాయపడ్డారు. -
కరోనాపై వాస్తవాలేమిటి ?
-
ఛాతీకి మధ్యలో గుండె.. ఆపరేషన్ సక్సెస్!
హైదరాబాద్: ఛాతీకి మధ్యలో ఉన్న గుండెకు సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా బైపాస్ సర్జరీ చేశారు. ఈ తరహా చికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారిగా వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవీ గురువారెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రతీక్ భట్నాగర్, అనెస్థిషియన్ డాక్టర్ సుబ్రమణ్యం శస్త్రచికిత్స కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన మహమ్మద్ మహబూబ్ శంషుద్ధీన్(52) తీవ్రమైన గుండె సంబంధ సమస్యతో బాధ పడుతున్నాడు. ఇటీవల గుండెపోటు రావడంతో చికిత్స కోసం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించగా మూడు ధమనులు మూసుకపోయినట్లు గుర్తించారు. గుండె రక్తం సరఫరా కేవలం 35 శాతానికి పడిపోయినట్లు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ను ఆశ్రయించగా, ఆయన పలు రకాల వైద్య పరీక్షలు నిర్విహించారు. 45 డిగ్రీలు వెనక్కి తిరిగి ఉన్న గుండె.. సాధారణంగా మనిషి గుండె ఛాతీ ఎడమ భాగంలో ఉంటుంది. కానీ మహమ్మద్ మహబూబ్‌కు మాత్రం ఛాతీ మధ్య భాగంలో 45 డిగ్రీలు వెనక్కి తిరిగి గుండె ఉంది. అంతేకాదు గుండె కింది భాగంలో లోపలివైపు ధమనులు ఉన్నాయి. వైద్య పరిభాషలో దీన్ని‘మోసోకార్డియో’గా పిలుస్తారు. లక్ష మందిలో ఎవరో ఒకరికి గుండె ఎడమవైపు కాకుండా ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది. ఇలాంటి వారికి చికిత్స చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. కానీ, డాక్టర్ ప్రతీక్ భట్నాగర్, డాక్టర్ శుభి భట్నాగర్, డాక్టర్ రాజమోహన్, డాక్టర్ సుబ్రహమణ్యంలతో కూడిన వైద్య బృందం ఈ కేసును ఓ సవాల్‌గా తీసుకుంది. టోటల్ ఆర్టియల్ రీవాస్క్యులరైజేషన్ మెళుకువలతో గుండె కొట్టుకుంటున్న సమయంలోనే ఎల్ఐఎంఎ-రేడియల్ వై గ్రాఫ్ట్ విధానంలో నాలుగు బైపాస్ గ్రాఫ్ట్‌లు విజయవంతంగా అమర్చారు. ఇందుకు నాలుగు గంటల సమయం పట్టినట్లు వైద్య బృందం తెలిపింది.


