అలియా భట్‌ 'ఆల్ఫా'కు మరోసారి బ్రేక్‌ | Alia Bhatt Movie Alpha Again Release date POSTPONED | Sakshi
Sakshi News home page

అలియా భట్‌ 'ఆల్ఫా'కు మరోసారి బ్రేక్‌

Mar 9 2026 12:10 PM | Updated on Mar 9 2026 12:20 PM

Alia Bhatt Movie Alpha Again Release date POSTPONED

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌, శార్వరీ వాఘ్‌లు నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆల్ఫా’. మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ ప్రకటించింది. మొదట క్రిస్మస్‌-2025లో విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. పలు కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని ఫిబ్రవరి 20 అని ఒకసారి ఏప్రిల్‌-2026 అని మరోసారి పేర్కొన్నారు. అయితే, తాజాగా మళ్లీ వాయిదా వేస్తున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్‌కు నిరాశ  ఎదురైంది. దర్శకుడు శివ్‌ రావేల్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఆల్ఫా సినిమా జులై 10న విడుదల చేస్తున్నట్లు  యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ తాజాగా ఒక పోస్టర్‌ విడుదల చేసింది.  స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రం కావడంతో సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ చూడని భారీ యాక్షన్ సీన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో అనిల్‌కపూర్, బాబీ డియోల్‌‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.., బాబీ డియోల్‌, అలియాలకు మధ్య భారీ యాక్షన్ సీన్స్‌ అదిరిపోతాయని అంటున్నారు. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ల సమక్షంలో యుద్ధపోరాట సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. అలియాకు గురువుగా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ కనిపిస్తారని టాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement