సంగీత లాయర్‌ అంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌.. కౌంటర్‌ ఇచ్చిన శరణ్య | Chennai High Court Advocate Big Statement to vijay and sangeetha issue | Sakshi
Sakshi News home page

సంగీతకు మద్ధతుగా యంగ్‌ లాయర్‌.. విజయ్‌ ఫ్యాన్స్‌కు కౌంటర్‌

Mar 9 2026 9:28 AM | Updated on Mar 9 2026 10:59 AM

Chennai High Court Advocate Big Statement to vijay and sangeetha issue

కోలీవుడ్‌ నటుడు విజయ్‌, సంగీతల విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది. అయితే, న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని  ఆయన భార్య సంగీత కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో  విజయ్‌ ఫ్యాన్స్‌ సంగీత కేసును వాదించే న్యాయవాదిపై తీవ్రంగా ట్రోలింగ్‌కు దిగారు. ఈ విషయం గురించి తాజాగా చెన్నై హైకోర్టు న్యాయవాది శరణ్య నటరాజన్‌ వివరణ ఇస్తూ ఒక పోస్ట్‌ చేశారు.

విజయ్, సంగీత విడాకుల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరణ ఇచ్చారు. 'నేను సంగీత న్యాయవాదిని కాదు. ఆమె తరపున కోర్టులో హాజరవుతున్నట్లు ఎవరో తప్పుగా ప్రచారం చేస్తున్నారు.  గతంలో జయం రవి, ఇప్పుడు విజయ్- త్రిష కృష్ణన్ ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నారని ఇప్పుడు ఇదే  ట్రెండ్ అని నేను పోస్ట్ చేసిన తర్వాతే నాపై ట్రోలింగ్‌ మొదలైంది. అయితే, అకస్మాత్తుగా కొంతమంది అభిమానులు నన్ను తిట్టడం ప్రారంభించారు. విజయ్‌ గురించి ఈ పోస్ట్ చేయమని ఎవరూ నాకు చెప్పలేదు. ఒకవేళ చేయాలనుకుంటే నేను చట్టపరంగా ఎన్ని వ్యాఖ్యలు అయినా సరే చేయగలను.

విజయ్-సంగీత విడాకుల గురించి నా అభిప్రాయాన్ని వివరించాలనుకుంటున్నాను. సంగీత తన స్టే-ఎట్-హోమ్ ఆర్డర్ కోసం పిటిషన్ దాఖలు చేసిన రోజున, ప్రజలు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుండగా మరొక మహిళ న్యాయం కోసం పోరాడుతుంది. సోషల్ మీడియాలో కొంతమంది అనుచరులు సంగీతను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరంగా ఉంది. కానీ, సాధారణ ప్రజలు   ఆమె పట్ల జాలిపడుతున్నారు. నాకు మరో రాజకీయ నేపథ్యం లేదా భావజాలం ఉండవచ్చు. కానీ, నేను ఎప్పుడూ టీవీకే పార్టీ గురించి మాట్లాడలేదు.  కరూర్‌లో 41 మంది మరణించినప్పుడు కూడా, నేను దానిని రాజకీయం చేయాలనుకోలేదు. ఒక మహిళగా, న్యాయవాదిగా నేను సంగీతకు మద్ధతు ఇస్తున్నాను. అందులో తప్పేముందు..? అభిమానం అనే ముసుగులో ఒకరిని గుడ్డిగా అనుసరించడం కంటే సానుభూతి, గౌరవం, న్యాయం ముఖ్యమని నేను నమ్ముతాను. ఇది రాజకీయం కాదు.. మానవత్వం అని శరణ్య అన్నారు.

శరణ్య ప్రకటన చూసిన కొంతమంది విజయ్‌ అభిమానులు భగ్గుమన్నారు. నీకు విజయ్‌ అన్న గురించి మాట్లాడే హక్కు లేదంటూ ఫైర్‌ అయ్యారు. సంగీత గురించి ఆలోచించడం సిగ్గుచేటు అని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement