'ధురంధర్‌' మేకర్స్‌కు తెలుగు ప్రేక్షకుల రిక్వెస్ట్‌ | Dhurandhar-2 movie telugu fans request to Aditya Dhar | Sakshi
Sakshi News home page

'ధురంధర్‌' మేకర్స్‌కు తెలుగు ప్రేక్షకుల రిక్వెస్ట్‌

Mar 9 2026 11:00 AM | Updated on Mar 9 2026 11:04 AM

Dhurandhar-2 movie telugu fans request to Aditya Dhar

బాలీవుడ్‌ మూవీ ‘ధురంధర్‌: ది రెవెంజ్‌’ తెలుగు ట్రైలర్‌ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తెలుగు ప్రేక్షకులు ఒక రిక్వెస్ట్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌  హీరోగా ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో గతేడాది వచ్చిన చిత్రం ‘ధురంధర్‌’. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా పార్ట్‌-2 రానుంది. దేశభక్తి కాన్సెప్ట్‌తో భారీ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా హిందీలో మాత్రమే విడుదలైన ఈ మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళంలో మార్చి 19న విడుదల చేస్తున్నారు. తెలుగు ట్రైలర్‌ విడుదల తర్వాత టాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి దర్శకుడికి ఒక  విన్నపం అంటూ వైరల్‌ అవుతుంది.

ధురంధర్‌ -2  నిర్మాతలు తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించిన తర్వాత డబ్బింగ్, సంభాషణల పట్ల తెలుగు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వచ్చింది. తెలుగు డబ్బింగ్ పనులను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించినట్లు సమాచారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు నుంచి దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఒక స్పష్టమైన అభ్యర్థన వైరల్‌ అవుతుంది.  ఈ చిత్రాన్ని పాన్-ఇండియ రేంజ్‌లో విడుదల చేస్తున్నందున, అభిమానులు పాటలను తెలుగులోకి డబ్ చేయకుండా వాటి అసలు హిందీ వెర్షన్‌లోనే ఉంచమని మేకర్స్‌ను అడుగుతున్నారు.

ఈ అభ్యర్థన వెనుక కారణం గతంలో అనేక డబ్ చేసిన సినిమా పాటలు  ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. అనువాదంలో విడుదలైన పాటలు బలహీనమైన మిక్సింగ్‌తో పాటు తప్పుడు అర్థాలు రావడం గమనించారు.  డబ్ చేసిన వెర్షన్‌లలో వచ్చే పాటలు సినిమా ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. దీని కారణంగా, పాటలు హిందీలోనే ఉంచాలని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు. మూవీలో డైలాగ్‌లను మాత్రమే తెలుగులోకి డబ్ చేస్తే మంచిదని చాలామంది భావిస్తున్నారు. నిర్మాతలు ఈ అభ్యర్థనను పరిశీలిస్తారా లేదా తెలుగు-డబ్ చేసిన పాటలతో ముందుకు వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాని ఆదిత్య, జ్యోతీదేశ్‌ పాండే, లోకేశ్‌ ధర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

Advertisement
 
Advertisement
Advertisement