త్రిషపై అనుచిత కామెంట్స్.. సారీ అంటూ పోస్ట్ | Kollywood actor R Parthiban apologises to actress trisha | Sakshi
Sakshi News home page

R. Parthiban: త్రిషపై కామెంట్స్. నటుడు క్షమాపణలు

Mar 9 2026 9:53 AM | Updated on Mar 9 2026 10:08 AM

Kollywood actor R Parthiban apologises to actress trisha

కోలీవుడ్ స్టార్ విజయ్ విడాకుల వివాదం తెరపైకి వచ్చాక అనూహ్యంగా హీరోయిన్ త్రిష పేరు వైరలవుతోంది. విజయ్‌కు అమెతో రిలేషన్‌ ఉందంటూ ఆయన భార్య సంగీత ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉండగా  కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు త్రిషపై అనుచిత కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్‌లో పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.

ఇది కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హీరోయిన్ త్రిష కూడా ‍అదేస్థాయిలో ఇచ్చిపడేసింది. ఆ నటుడికి అసలు బుర్రనే లేదంటూ ఎద్దేవా చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పార్తిబన్ స్పందించారు. ఈ మేరకు ఆయన క్షమాపణలు కోరారు. ఇప్పుడు జరిగిన దానికి నేనే సారీ చెప్పడం తప్ప వేరే మార్గం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదానికి ఇకపై ఫుల్‌స్టాప్‌ పడినట్లే.

అసలేం జరిగిందంటే..

తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్‌ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.


పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌, పొన్నియన్‌ సెల్వన్‌ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement