గాయపడ్డ సింహం అలరిస్తుంది: తరుణ్‌ భాస్కర్‌ | Tharun Bhascker Speech At GaayaPadda Simham Theme Song Launch Event | Sakshi
Sakshi News home page

గాయపడ్డ సింహం అలరిస్తుంది: తరుణ్‌ భాస్కర్‌

Mar 9 2026 1:34 AM | Updated on Mar 9 2026 9:38 AM

Tharun Bhascker Speech At GaayaPadda Simham Theme Song Launch Event

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రంలో మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించగా, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. పవన్‌ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్‌ ప్రతాప, విజయ్‌ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ వేసవిలో విడుదల  కానుంది. తాజాగా ‘పాదం కదిలే కానీ... తీరం కనలే...’ అంటూ మొదలయ్యే ఈ సినిమా థీమ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ర్యాపర్‌ అసుర లిరిక్స్‌ అందించిన ఈపాటను ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ స్వీకర్‌ అగస్తీపాడారు. ఈ సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్‌ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కశ్యప్‌ శ్రీనివాస్‌ అసలైన హీరో. ఆయన కష్టపడ్డ సింహం. నేను అదృష్టమైన సింహం. ‘గాయపడ్డ సింహం’ ప్రేక్షకులను అలరిస్తుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడండి’’  అన్నారు.

‘‘త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ని చేస్తాం. తరుణ్‌ తన పెర్ఫార్మెన్స్‌తో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తారు’’ అని చెప్పారు కశ్యప్‌. ‘‘ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఏప్రిల్‌లో రిలీజ్‌ ΄్లాన్‌ చేశాం’’ అని నిర్మాత భాను కిరణ్‌ తెలిపారు. ‘‘ఈ సినిమా చాలా క్రేజీగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు లిరిక్‌ రైటర్‌ ర్యాపర్‌ ప్రమోద్‌ అసుర. ‘‘హీరో అమెరికన్‌ డ్రీమ్‌ ఒక్కసారిగా ఎలా తలకిందులవుతుందో ఈపాట చూపిస్తుంది. అమెరికన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన డిపోర్టేషన్‌ నిర్ణయం తర్వాత  హీరో జీవితంలో ఏర్పడే గందరగోళ పరిస్థితులను ఈపాటలో సరదాగా చూపించాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement