హీరోహీరోయిన్లు అన్నాక సినిమాలు చేస్తారు. రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ గత కొన్నాళ్లలో కొందరు సెలబ్రిటీలు.. ముందు మూవీస్ చేస్తున్నారు. రిలీజ్ తర్వాత పారితోషికాలు అందుకుంటున్నారు. పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక కూడా 'ద గర్ల్‌ఫ్రెండ్' విషయంలో ఇలానే చేసినట్లు తెలుస్తోంది. మూవీ విడుదలకు ముందు ఓ ఈవెంట్‌లో నిర్మాత ధీరజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిలీజ్ తర్వాత తనకు డబ్బులివ్వాలని రష్మిక చెప్పిన సంగతి బయటపెట్టారు.
'గర్ల్‌ఫ్రెండ్' రీసెంట్‌గానే (నవంబరు 07న) థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకీ కలెక్షన్ నంబర్స్ పెరుగుతున్నాయి. దీంతో రష్మిక రెమ్యునరేషన్ ఎంత తీసుకుందా అనే విషయం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మిక.. ఒక్కో ప్రాజెక్ట్ కోసం రూ.5-6 కోట్ల వరకు అందుకుంటోందట. 'గర్ల్‌ఫ్రెండ్' కోసం మాత్రమే రూ.3 కోట్లు చాలానే అందట. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: 'జటాధర' సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా)
కొన్నిసార్లు కొన్ని సినిమాలు.. ఆయా హీరోహీరోయిన్లకు కిక్ ఇస్తుంటాయి. బహుశా రష్మికకు కూడా 'గర్ల్‌ఫ్రెండ్'తో ఇలాంటి సంతృప్తి లభించినట్లు ఉంది. అందుకే సాధారణంగా తీసుకునే దానికంటే తక్కువగానే తీసుకుందని మాట్లాడుకుంటున్నారు. దీంతో రష్మిక మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అలానే ప్రస్తుతం ఎక్కడ చూసినా రష్మిక పేరే వినిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది కాలంలో ఈమె నుంచి ఐదు వైవిధ్య భరిత సినిమాలు రావడం విశేషం.
'ద గర్ల్‌ఫ్రెండ్' విషయానికొస్తే.. భూమా(రష్మిక) ఎం.ఏ లిటరేచర్ స్టూడెంట్. తండ్రి(రావు రమేశ్)ని ఒప్పించి హస్టల్‌లో చేరుతుంది. కానీ కాలేజీలో చేరిన తొలిరోజే భూమా, విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ప్రేమలో పడతారు. విక్రమ్‌ని దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) కూడా ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం భూమానే ప్రేమిస్తాడు. రిలేషన్‌లో మానసికంగా, శారీరకంగా చాలానే దూరం వెళ్తారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..)


