స్టార్‌ హీరోలతో సినిమా.. రిగ్రెట్‌ ఫీల్‌ అవుతున్నానన్న హీరోయిన్‌ | Anu Emmanuel Talk About The Girlfriend Movie | Sakshi
Sakshi News home page

నాలుగు డ్యాన్స్ స్టెప్పులు, ఏవో డైలాగ్స్ ..ఇకపై అలా చేయను : అను

Nov 11 2025 5:32 PM | Updated on Nov 11 2025 5:52 PM

Anu Emmanuel Talk About The Girlfriend Movie

నేను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, శివకార్తికేయన్, కార్తి, విశాల్..ఇలా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అయితే నా కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. కొన్ని కమర్షియల్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. నాలుగు డ్యాన్స్ స్టెప్స్ వేసి, ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు గానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా’ అని అన్నారు హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్. ఈ బ్యూటీ కీలకపాత్రలో, రష్మిక-దీక్షిత్‌ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుర్గ అనే క్యారెక్టర్‌లో అను నటించింది. ఈ మూవీకి హిట్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో తాజాగా అను మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలతో పాటు తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమా కోసం మొదట ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్, నా క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించింది. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది. ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉంది. అయితే నేను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించను.

ఈ చిత్రంలో దుర్గ క్యారెక్టర్ లో నటించాను. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయంవేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ రాహుల్ నా క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానంతో హ్యాపీగా ఫీలయ్యా. రాహుల్ చాలా సెన్సిటివ్ డైరెక్టర్. నా క్యారెక్టర్ ఒక్కటే కాదు, అన్ని పాత్రలను చేయి పట్టి నడిపించారు. కమర్షియల్ మూవీస్ లో మాతో ఓవర్ యాక్షన్ చేయిస్తారు.

ఈ చిత్రంలో నాకు అవకాశం వచ్చేసరికే రశ్మికను భూమా పాత్రకు తీసుకున్నారు. నేను భూమా పాత్రలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. హాలీవుడ్ లో మూవీస్ చూస్తే హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు. ప్రతి ఒక్కరూ కథకు కాంట్రిబ్యూట్ చేసేలా క్యారెక్టర్స్ చేస్తారు. ఈ చిత్రంలో రాహుల్ అలాంటి ప్రయత్నమే చేశారు. అన్ని పాత్రలను జస్టిఫై చేసేలా మూవీ రూపొందించారు.

నా కెరీర్ పరంగా అసంతృప్తిగానే ఉన్నా, అయితే నటిగా సంతృప్తి ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి నటించాను. అయితే నాది అవకాశాల కోసం ఆరాటపడే తత్వం కాదు. నాకు వచ్చే సినిమా తప్పకుండా దక్కుతుందని నమ్ముతా.

ప్రొడ్యూసర్ ధీరజ్ తో గతంలో ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాను. "ది గర్ల్ ఫ్రెండ్" లాంటి చిత్రాలు వర్కవుట్ కావాలంటే ధీరజ్ లాంటి మంచి ప్రొడ్యూసర్ ఉండాలి. మంచి టీమ్ కుదరకే గతంలో కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఆదరణ పొందలేకపోయాయి.

ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement