రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్ఫ్రెండ్. ఈ చిత్రంలో రష్మిక మందన్నా లీడ్ రోల్లో కనిపించింది. దీక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ లవ్ ఎంట్ర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లోనే రూ. 20.4 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్గా.. ప్రొఫెషనల్గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్నది ఈ సినిమాలో చూపించారు. దీంతో ది గర్ల్ఫ్రెండ్ మూవీ అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ది గర్ల్ఫ్రెండ్ మూవీ టీమ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.
అయితే ఇటీవల ది గర్ల్ఫ్రెండ్ మూవీ థియేటర్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సినిమా చూసిన ఓ అమ్మాయి డైరెక్టక్ రాహుల్‌ను చూసి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా తన దుపట్టా తీసి గర్వంగా తిరుగుతానంటూ చేసి చూపించింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలైంది. దీంతో అమ్మాయిని మెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఒక హగ్ ఇచ్చాడు. అయితే ఇదంతా చూసిన ఓ నెటిజన్ అంతా పీఆర్ స్టంట్ అని ట్రోల్ చేశాడు. కేవలం దుపట్టా, హగ్ కోసమే ఆ అమ్మాయికి డబ్బులిచ్చి అలా చేయించారా? అంటూ విమర్శించాడు. ఇది చూసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. ట్విటర్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు.
ఆ అమ్మాయిపై నెగెటివిటీ రాకూడదనే ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నానని రాహుల్ ట్వీట్ చేశాడు. కానీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను ఖండించాల్సి అవసరముందన్నారు. ఈ థియేటర్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు ఎక్కడికి వెళ్లాలో మేము కచ్చితంగా డిసైడ్ అవ్వలేదన్నారు. ఆ థియేటర్కు మేము వెళ్తామో కూడా చివరికి వరకు మాకే తెలియదని రాసుకొచ్చాడు. ఇందులో ఎలాంటి పీఆర్ స్టంట్ లేదని.. అది పూర్తిగా యాదృఛ్చికం అని రవీంద్రన్ ట్వీటిర్లో పోస్ట్ చేశారు.
రాహుల్ రవీంద్రన్ తన ట్వీట్లో రాస్తూ..' ఆ వీడియోను బయట పెట్టడం గురించి నేను కొంచెం ఆందోళన చెందా. కొందరు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తారని భయపడ్డా. ఇప్పుడు ఆ అమ్మాయి పట్ల నాకు భయంగా ఉంది. ఆమెకు చాలా బలంగా, ధైర్యంగా నిలబడాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం ద్వారా వారి చున్నీలను తీయమని నేను చెప్పడం లేదు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతం. ఒక అమ్మాయి తన దుపట్టాను యాదృచ్ఛికంగా తీయడం వల్ల ఓ వర్గం ప్రజలు బాధపడుతున్నారు. ఇది మన సంస్కృతిని కాపాడుకోవడం అనే చాలా పెద్ద ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది' అని పోస్ట్ చేశారు.
ఇంకా ట్వీట్లో ప్రస్తావిస్తూ..'ప్రతి వారం ఎవరైనా పురుషులు ఓ యాక్షన్ సన్నివేశానికి ముందు తమ చొక్కాలు చింపివేసినప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని నేను ఆశ్చర్యపోతున్నా. నేను ఒకరిని ప్రేరేపించాలని ఎక్కడా చెప్పడం లేదు. కేవలం పక్షపాత ధోరణిని మాత్రమే ప్రశ్నిస్తున్నా. సంతోషంగా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ నా ముఖంలో చిరునవ్వును తెప్పిస్తుంది. కానీ ఇక్కడ మన సంస్కృతిని కాపాడుకునే భారాన్ని ఓ వర్గం మన మహిళల భుజాలపై మాత్రమే ఎందుకు మోపింది? చాలామంది ప్రతిరోజూ ధోతీల కట్టుకుని ఎందుకు తిరగడం లేదు? వారు ప్యాంటుకు ఎందుకు మారారు? వారిలో చాలామంది ఇంగ్లీషులో ఎందుకు ట్వీట్ చేస్తారు? అన్నింటికంటే, వారు మన సంస్కృతిని కాపాడుకోవడం గురించి చాలా శ్రద్ధ వహిస్తారు కదా? ఇలాంటి ప్రశ్నలు తెలివితక్కువవిగా, చిరాకు తెప్పించే అపరిపక్వంగా అనిపిస్తాయి కదా. అలాంటప్పుడు వారు మహిళలను వేరే ప్రమాణాలకు అనుగుణంగా ఎందుకు ఉంచుతున్నారు? దీనికి నా దగ్గర సమాధానాలు లేవు. ది గర్ల్ఫ్రెండ్ లాంటి సినిమా ఈ రోజు సందర్భోచితంగా ఉందా? అవసరమా? అని నన్ను అడిగే కొద్ది మంది మాత్రమే ఈ చిత్రానికి వస్తున్న ప్రతిస్పందనలను గమనిస్తున్నారని ఆశిస్తున్నా. ఇక్కడే వారికి సమాధానం దొరుకుతుంది' అని నెటిజన్కు గట్టిగానే రిప్లై ఇచ్చేశాడు.
I didn’t want to react to any of this so as to not draw any more negativity towards the girl. But the accusations keep getting more and more baseless. Firstly, 20 minutes before reaching this theatre… we were trying to decide between two different theatres and where we should… https://t.co/eohxBhzGUg
— Rahul Ravindran (@23_rahulr) November 14, 2025


