నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొద్దిరోజులుగా మాస్క్‌లోనే కనిపించేది.. కానీ, తాను నటించిన కొత్త సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ ఈవెంట్ కోసం మాస్క్ లేకుండా మెరిసింది. ట్రైలర్‌ను చూస్తే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తన నటనకు ఎక్కువ స్కోప్ ఉందని తెలుస్తోంది. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత తన గురించి మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో గట్టిగా మాట్లాడుకోవడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే, కొద్దిరోజులుగా రష్మిక ఎక్కడ కనిపించినా సరే మాస్క్ పెట్టుకునే ఉండేది. తాజాగా జరిగిన ట్రైలర్ ఈవెంట్‌కు మాత్రం మాస్క్ లేకుండానే వచ్చేశారు.
రష్మిక తరచూ ముఖానికి మాస్క్ వేసుకుని కనిపించడంతో అభిమానులు కూడా ఏమై ఉంటుందనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె గత వారం చెన్నై విమానాశ్రయంలో మాస్క్ ధరించే మెరిశారు. ఆ సమయంలో ముఖానికి మాస్క్ తొలగించమని ఫొటోగ్రాఫర్లు కోరగా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నందువల్ల కుదరదని ఆమె పేర్కొన్నారు. దీంతో రష్మిక మందన్నాకు ఏమైందని ఆరా తీయగా ఆమె తన అందాన్ని మరింత మెరుగు పరచుకునే విధంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిసింది. చాలారోజుల తర్వాత ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా కోసం మాస్క్ లేకుండా కనిపించి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. మరింత గ్లామర్‌గా కనిపిస్తున్న రష్మిక ఫోటోలు, వీడియోలు నెట్టింట షేర్ అవుతున్నాయి.

రీసెంట్‌గా థామా సినిమాతో మెప్పించిన రష్మిక.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో మరోసారి అభిమానులను పలకరించనున్నారు. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా నవంబరు 7న విడుదల కానుంది.


