కన్నులలో వెన్నెలలే కురిసే... | The Girlfriend Team Birthday Wishes To Rashmika Mandanna With Teaser and new poster release | Sakshi
Sakshi News home page

కన్నులలో వెన్నెలలే కురిసే...

Apr 6 2025 1:12 AM | Updated on Apr 6 2025 1:12 AM

The Girlfriend Team Birthday Wishes To Rashmika Mandanna With Teaser and new poster release

రష్మికా మందన్నా, దీక్షిత్‌ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో అల్లుఅరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది. శనివారం రష్మికా మందన్నా బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ ఆడియో, కొత్త స్టిల్‌ను రిలీజ్‌ చేశారు. 

ఈ టీజర్‌లో విజయ్‌ దేవరకొండ వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. అలాగే ‘రేయి లోలోతుల సితార...’ పాట కూడా ఉంది. ‘‘కన్నులలో వెన్నెలలే కురిసే, మది మోసే తల వాకిట తడిసే..’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వరపరచిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా విజయ్‌ దేవరకొండ, హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్, చిన్మయి శ్రీ పాద పాడారు.

Advertisement
 
Advertisement
Advertisement