సాధారణంగా నవంబర్‌లో పెద్ద సినిమాలు రిలీజ్ కావని, ఒకవేళ అయినా పెద్దగా ఆడవని అంటారు . కానీ ఈ నవంబర్‌లో మాత్రం ప్రతి వారం బాక్సాఫీస్ వద్ద మంచి పోటీనే ఎదురవుతుంది. మొదటి వారమే రామాయణంతో పాటు ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం(నవంబర్ 20) ఏకంగా మూడు పెద్ద సినిమాలు(ఓం, ఆకాశంలో ఒకతార, ఈఎన్‌ఈ రిపీట్) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ఆకాశంలో ఒకతార, ఈఎన్‌ఈ రిపీట్ చిత్రాలు పాజిటివ్ టాక్‌ని సంపాదించుకున్నాయి. ఇక వచ్చేవారం(నవంబర్ 27) రెండు వయొలెంట్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. అందులో ఒకటి శర్వానంద్ భోగి, మరొకటి రష్మిక మందన్నా ‘మైసా’.
ఈ రెండు సినిమాల్లోనూ వయొలెన్స్ ఎక్కువే ఉన్నట్లు ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. అటు శర్వా, ఇటు రష్మిక ఇద్దరు వెనుకబడిన వర్గానికి చెందిన పాత్రలే పోషించారు. అణిచివేతపై తిరుగుబాటు చేసి తమ జాతిని రక్షించుకోవడానికి ఎంతటి రక్తపాతానికైనా వెనుకాడకపోవడం రెండు సినిమాల్లో కనిపిస్తోంది.యాక్షన్ బ్లాస్ట్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాల క్లైమాక్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. రెండు సినిమాల మేకర్స్ తమ ప్రాజెక్టు అద్భుతంగా వచ్చిందని.. రిలీజ్ తర్వాత హిస్టరీ క్రియేట్ చేస్తాయని చెబుతున్నారు.
అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం రెండు సినిమాలు వెనుకబడే ఉన్నాయి. పబ్లిసిటీ విషయంలో ఇప్పుడిప్పుడే కాస్త పోకస్ పెట్టారు. భోగి దర్శకుడు సంపత్ నందికి అనుభవం ఉంది. ప్రమోషన్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇటు మైసా దర్శకుడు రవీంద్ర పుల్లేకు అనుభవం లేదు. దీంతో ప్రచార బాధ్యతలను రష్మికనే తీసుకుంది. ప్రతి ఈవెంట్‌కు హాజరవుతూ..తమ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. నిన్న రిలీజైన ‘రాములమ్మ’ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే భోగి మాధిరే మైసాపై కూడా భారీ హైప్ అయితే ఇప్పటివరకు క్రియేట్ కాలేదు. అందుకే ఈ మూడు నాలుగు రోజులను ప్రమోషన్లకు గట్టిగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి భోగి, మైసా చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఏది విజయం సాధిస్తుందో చూడాలి.


